Andhra Pradesh: ఏపీలో ఆ ఉద్యోగులను తొలగిస్తున్నారా..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం..

|

Aug 10, 2023 | 8:45 PM

సోషల్ మీడియాలో అనవసర ప్రచారాలు ఎక్కువయ్యాయి. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు ప్రస్తుత కాలంలో ప్రచారాలు జరగుతున్నాయి. తాజాగా.. ఏపీ ప్రభుత్వంపై కొందరు చేస్తున్న అతస్య ప్రచారాలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు రిప్లే ఇస్తోంది. తాజాగా.. ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగాలకు ఎసరు.. అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పందించింది.

Andhra Pradesh: ఏపీలో ఆ ఉద్యోగులను తొలగిస్తున్నారా..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం..
Andhra Pradesh
Follow us on

అమరావతి, ఆగస్టు 10: సోషల్ మీడియాలో అనవసర ప్రచారాలు ఎక్కువయ్యాయి. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు ప్రస్తుత కాలంలో ప్రచారాలు జరగుతున్నాయి. తాజాగా.. ఏపీ ప్రభుత్వంపై కొందరు చేస్తున్న అతస్య ప్రచారాలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు రిప్లే ఇస్తోంది. తాజాగా.. ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగాలకు ఎసరు.. అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పందించింది. ఈ కథనం అభూతకల్పనలు, అవాస్తవాలతో ఉన్నట్లు ఏపీ ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది. విద్యారంగానికి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషిని ఓర్వలేక దురుద్దేశాలు ఆపాదించేలా ఈ కథనం ఉందని పేర్కొంది. ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే ఈ కథనంలో అవాస్తవాలు ప్రచురించారంటూ ఫైర్ అయింది. ఈ కథనాన్ని ఖండించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. వాస్తవాలను పేర్కొంది. విద్యా వ్యవస్థ మీద, మరీ ముఖ్యంగా ఉన్నత విద్య మీద బురద జల్లడం, విషం కక్కడం దినచర్యగా మారిపోయిందని.. విశ్వ విద్యాలయాల్లో అధ్యాపక నియామకం అంశం కోర్టుల్లో ఉన్నంత కాలం ఒక్క అధ్యాపకుడిని కూడా ప్రభుత్వం నియమించలేదంటూ కొందరు కథనాలు ప్రచురిస్తున్నట్లు తెలిపింది. కోర్టులో కేసులు ఉండగా ఏ ప్రభుత్వం కూడా యూనివర్సిటీ అధ్యాపక నియామకాలు చేపట్టలేదని.. ఈ విషయం తెలిసి కూడా.. అధ్యాపకుల కొరత గురించి, అధ్యాపక నియామకాలు జరగట్లేదంటూ ప్రస్తావిస్తూ కథనాలను కొందరు ప్రచురించారంటూ పేర్కొంది. ఇంతకాలం ఈ సాకుతో కథనాలను ప్రచురించి.. ఇవాళ ప్రభుత్వం అధ్యాపక నియామకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ఒప్పంద అధ్యాపకులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందంటూ ఉన్నత విద్యామండలి విమర్శించింది.

ఇన్నాళ్లూ అధ్యాపక నియామకాలు చేపట్టడం లేదని పదే పదే ప్రస్తావించిన వారు.. నేడు నియామకాలు చేపడితే ఒప్పంద అధ్యాపకులకు ఇబ్బంది కలుగుతుందని ప్రచారం చేయడం హాస్యాస్పదమంటూ విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పంద అధ్యాపకుల పట్ల పూర్తి సానుభూతితో ఉందని.. వారికి న్యాయం చేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటోందని పేర్కొంది. రాష్ట్రంలో 20 యూనివర్సిటీల్లో దాదాపుగా 3,046 మంది ఒప్పంద అధ్యాపకులు పని చేస్తున్నారని.. ఇందులో చాలా మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్లలో ఒప్పంద అధ్యాపకులుగా పని చేస్తున్నారని ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఈ అధ్యాపక నియామకాల ద్వారా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఈ అధ్యాపక నియామకాలన్నీ కూడా రెగ్యులర్ పోస్టులకు మాత్రమే జరుగుతుంది. అంటే సెల్ప్ ఫైనాన్స్ ప్రోగ్రామ్లో పని చేస్తున్న వారంతా నిరభ్యంతరంగా కంటిన్యూ కావచ్చని తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ అధ్యాపక నియామకాల్లో ఒప్పంద అధ్యాపకులకు తగు విధంగా వెయిటేజీ కూడా ఇవ్వాలని ఇదివరకే ముఖ్యమంత్రి వైయస్ జగన్ సూచించారని తెలిపింది. ఆ మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయని.. ఈ వెయిటేజీ ఇవ్వడం వల్ల చాలా మంది ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్ అధ్యాపకులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చాలా మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు కలిసి వస్తుందని తెలిపింది. ఉద్యోగులను రెగ్యులర్ చేసే విషయంలో యూనివర్సిటీల్లో అమలు చేయడానికి కొన్ని ప్రతిబంధకాలు కూడా ఉన్నాయని పేర్కొంది. యూనివర్సిటీలు ఒప్పంద అధ్యాపకుల్ని నియమించేటప్పుడు రిజర్వేషన్ విధానం అవలంభించకపోవడం, రోస్టర్ పద్ధతి పాటించకపోవడం, ఏ యూనివర్సిటీ కూడా యూజీసీ నిర్దేశించిన పద్ధతుల్లో ఒప్పంద అధ్యాపకుల్ని నియమించకపోవడం లాంటివి ఉన్నట్లు పేర్కొంది. ఇవి కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం చేయాలని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఏ ఒక్కరికీ అన్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ముమ్మాటికీ లేదని ఏపీ ఉన్నత విద్యా మండలి తెలిపింది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పని చేస్తున్న పలువురు ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్ కావడం గానీ, లేదా కాంట్రాక్ట్ పద్దతిన కొనసాగడం కానీ జరుగుతుంది. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఉద్యోగాలు పోతాయంటూ చేస్తున్న ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..