
ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు భవ్య గుజరాత్ ప్యాకేజ్ (9 రాత్రులు / 10 రోజులు) కోసం బయలుదేరుతుంది. ఈ రైలు 2025 అక్టోబర్ 27న సికింద్రాబాద్ ఉదయం 8 గంటలకు, నిజామాబాద్ ఉదయం 11:30 గంటలకు, నాందేడ్ మధ్యాహ్నం 02:00 గంటలకు, పూర్ణా జంక్షన్ మధ్యాహ్నం 02:50 గంటలకు చేరుకుంటుంది.
ప్రయాణ మార్గం: రేణిగుంట నుండి బయలుదేరి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్, సికింద్రాబాద్ జంక్షన్, నిజామాబాద్ జంక్షన్, హజూర్ సాహెబ్ నాందేడ్, పూర్ణా జంక్షన్ మీదుగా ప్రయాణిస్తుంది.
సౌకర్యాలు: రోజుకు మూడు భోజనాలు, వసతి, రవాణా సదుపాయం, ప్రతి బోగీలో IRCTC సిబ్బంది అందుబాటులో ఉంటారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని IRCTC కోరుకుంటుంది. మరిన్ని వివరాలకు
వెబ్‌సైట్ www.irctctourism.com, 9701360701, 9281030749, 9281030750, 9281495843 నంబర్లను సంప్రదించవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి