Ippatam Village: ఇప్పటంలో ప్లెక్సీల కలకలం.. మా ఇల్లు ఎవరూ కూల్చలేదు.. మాకు ఎవరి సానుభూతి వద్దంటూ..

|

Nov 24, 2022 | 11:21 AM

ఇప్పటం గ్రామంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయ్. మా ఇళ్లు ఎవరూ కూల్చలేదు, ఎవరి సానుభూతి మాకొద్దు, డబ్బులిచ్చి అబద్ధాన్ని నిజం చేయవద్దంటూ ఇళ్లపై ఫ్లెక్సీలు కట్టారు కొందరు.

Ippatam Village: ఇప్పటంలో ప్లెక్సీల కలకలం.. మా ఇల్లు ఎవరూ కూల్చలేదు.. మాకు ఎవరి సానుభూతి వద్దంటూ..
Ippatam Village
Follow us on

గత కొన్ని రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం రాజకీయాలకు వేదికగా  వార్తల్లో నిలుస్తోంది. జనసేన పార్టీ ప్లీనరీ సమయంలో వేదికగా మారి వార్తల్లోనిలిచింది మొదలు.. మొన్న రోడ్డు వెడల్పు చేయడం కోసం ప్రభుత్వ అధికారులు ఇళ్లను కూలుస్తున్నారు అన్న వార్తలు వినిపించడం వరకూ ఇప్పటం గ్రామం వార్తలకు వేదికగా మారింది. ఎన్నికల కంటే ముందుగానే రాజకీయ పరామర్శలతో రగిలిపోతోంది ఇప్పటం గ్రామం. నారా లోకేష్‌ టూర్‌తో ఇప్పటంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయ్‌. ఇంతకీ, ఆ ఫ్లెక్సీల్లో ఏముంది? వాటిని కట్టిందెవరు? తెలుసుకుందాం..

నివురుగప్పిన నిప్పులా తయారైంది ఇప్పటం గ్రామం. ఇళ్ల కూల్చివేతపై చెలరేగిన రాజకీయ మంటలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయ్‌. జనసేన వర్సెస్‌ వైసీపీగా సాగుతోన్న పొలిటికల్‌ ఫైట్‌లోకి ఇప్పుడు టీడీపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. నారా లోకేష్‌ టూర్‌తో ఇప్పటం గ్రామంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయ్. మా ఇళ్లు ఎవరూ కూల్చలేదు, ఎవరి సానుభూతి మాకొద్దు, డబ్బులిచ్చి అబద్ధాన్ని నిజం చేయవద్దంటూ ఇళ్లపై ఫ్లెక్సీలు కట్టారు కొందరు. ఈ ఫ్లెక్సీలపై ఘాటుగా రియాక్టయ్యారు నారా లోకేష్‌. ఫ్లెక్సీలు కట్టింది పదిశాతమే, మిగతా 90శాతం ప్రజల కోసమే తానొచ్చంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు లోకేష్‌.

 

ఇవి కూడా చదవండి

ఇటీవల ఇప్పటంతో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, ప్రతి ఇంటికీ లక్ష రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు. పవన్‌ ప్రకటనతోనే ఇప్పుడు తమ ఇళ్లపై ఫ్లెక్సీలు కట్టారు కొందరు. అయితే, నారా లోకేష్‌ పర్యటన టైమ్‌లో ఇళ్లపై ఫ్లెక్సీలు కట్టడం గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఫ్లెక్సీలు కట్టినవాళ్లంతా వైసీపీ కార్యకర్తలంటూ నిప్పులు చెరిగారు నారా లోకేష్‌. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ, ఏం చేసినా ప్రజలను ఒప్పించాలని చేయాలన్నారు లోకేష్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..