AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Education: విద్యాశాఖలో విజయాల కంటే వివాదాలే ఎక్కువ.. ఈసారి మొత్తం సీన్‌ రివర్స్!

విద్యాశాఖ సాధించిన విజ‌యాల కంటే వివాదాలే ఎక్కువ అని పేరుప‌డింది. విద్యాశాఖ ఎవ‌రు తీసుకున్నా స‌వాల్ స్వీక‌రించిన‌ట్టే..! క‌ష్టం అంటే ఇష్టంగా భావించి.. క‌ష్టాల‌ను నేర్పు-ఓర్పుతో అధిగ‌మించే చాలెంజ్ కింగ్ నారా లోకేష్ విద్యాశాఖను చేప‌ట్టి పెను స‌వాల్ స్వీక‌రించారు. విద్యావ్యవ‌స్థలో వేళ్లూనుకున్న స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించారు. సంస్కర‌ణ‌ల‌కు నాంది ప‌లికారు. ప్రణాళికాబ‌ద్ధంగా విద్యావ్యవ‌స్థను గాడిలో పెట్టారు. క‌ష్టానికి త‌గ్గ ప్రతిఫ‌లం ఇంట‌ర్ ఫ‌లితాల రూపంలో క‌నిపించే స‌రికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మోములో విజ‌య‌ద‌ర‌హాసం మెరిసింది..

AP Education: విద్యాశాఖలో విజయాల కంటే వివాదాలే ఎక్కువ.. ఈసారి మొత్తం సీన్‌ రివర్స్!
Education Minister Nara Lokesh
Srilakshmi C
|

Updated on: Apr 15, 2026 | 4:14 PM

Share

అమరావతి, ఏప్రిల్ 15: ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాలు 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ ఫలితాలు వ‌చ్చాయి. విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన సంస్కర‌ణ‌లు, అమ‌లుచేసిన ప్రణాళిక‌ల వ‌ల్లే మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.

ఇంట‌ర్‌లో మెరుగైన ఫ‌లితాలు

  • మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణత.. ఇది గత 12 ఏళ్లలో అత్యధికం.
  • రెండవ సంవత్సరం 81% ఉత్తీర్ణత.. ఇది గత 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమ ఫలితం.

ప్రభుత్వ నిర్వహణలోని విద్యాసంస్థల్లో ..

  • మొదటి సంవత్సరం 66% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలోనే రికార్డు సృష్టించాయి.
  • రెండవ సంవత్సరం 76% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలో రెండవ ఉత్తమ ఫ‌లితాలు న‌మోద‌య్యాయి.

సంక్షేమం-సంస్కర‌ణ‌లు

ఇప్పటివ‌ర‌కూ హైస్కూలు విద్యార్థుల‌కే అమ‌ల‌వుతున్న డొక్కా సీత‌మ్మ మ‌ధ్యాహ్న బ‌డి భోజ‌నంను ఇంట‌ర్ విద్యార్థుల‌కూ అమ‌లు చేశారు. స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, పోటీ పరీక్షల మెటీరియల్, సైన్స్ ప్రాక్టికల్ రికార్డులు/ మాన్యువల్స్‌ను పంపిణీ చేశారు. ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టులను అర్హులైన జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులతో భర్తీ చేశారు. బోధనా సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీతో భర్తీ చేసి, బోధనకు అంతరాయం లేకుండా చూశారు.

ప్రణాళిక‌- పర్యవేక్షణ

జూనియ‌ర్ కాలేజీ విద్యార్థుల‌కు ప‌క‌డ్బందీగా యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయ‌ర్లీ, ప్రీ-ఫైనల్ పరీక్షలను కేంద్రీకృత పద్ధతిలో నిర్వహించారు. పరీక్షా ఫలితాలను డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్ల పనితీరును ప్రతి నెలా సమీక్షించారు. కళాశాల పని వేళలను ఉదయం 9:30 నుంచి 9 గంట‌ల‌కు సాయంత్రం 4 గంట‌ల నుంచి 5 గంట‌ల వరకు మార్చారు.

ఇవి కూడా చదవండి

‘సంకల్పం – 2026’ (50 రోజుల విజయ ప్రణాళిక)

విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారిని A, B, C కేటగిరీలుగా విభజించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విద్యార్థులు ఏ స‌బ్జెక్టుల్లో ఇంకా మెరుగు కావాలో గుర్తించి ఆ దిశ‌గా శిక్ష‌ణ అందించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను రూపొందించి పంపిణీ చేశారు.

తీసుకున్న చ‌ర్యలు ఇవే

  • కేర్ టేకర్ వ్యవస్థ ద్వారా ప్రతి జూనియర్ లెక్చరర్ కనీసం 10 మంది విద్యార్థులను దత్తత తీసుకుని, వారి హాజరు, ఫలితాల బాధ్యతను స్వీకరించారు.
  • విద్యార్థుల సంక్షేమం చూస్తూనే ఇందులో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంపొందించారు.
  • జూనియ‌ర్ కాలేజీల్లో ఏడాదికి రెండుసార్లు మెగా పేరెంట్ టీచ‌ర్ మీటింగులు నిర్వహించి.. పిల్లల ప్రగ‌తిని వివ‌రించే ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు.
  • డిజిటల్ కనెక్టివిటీతో స‌త్ఫలితాలు సాధించారు. సిలబస్ పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేయడానికి క్లాస్ వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కొత్త ప్రశ్నపత్రం విధానం ప్రవేశపెట్టడం వల్ల, వారు అన్ని సబ్జెక్టులలో అత్యధిక స్కోరు సాధించడానికి మంచి అవకాశం ఏర్పడింది.

విద్యాశాఖా మంత్రిగా నారా లోకేష్ ప‌ట్టుద‌ల‌, కృషితో ఇంట‌ర్ మీడియ‌ట్‌లో మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చాయి. క్షేత్రస్థాయి నుంచి వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా.. అధికారులు, నిపుణుల సూచ‌న‌లు-స‌ల‌హాల‌తో రూపొందించిన ప్రణాళిక ప‌క‌డ్బందీగా అమ‌లు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంత‌రం ప‌ర్యవేక్షించారు. ల‌క్ష్యానికి చేరుకున్నారు. ఇంట‌ర్‌లో మెరుగైన ఫ‌లితాలు సాధించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..