AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: దేశానికి ప్రతి ఏటా 1000 కిలోల బంగారం ఇవ్వనున్న ఏపీ.. త్వరలోనే ఉత్పత్తి స్టార్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ బంగారు గని త్వరలో పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ప్రకటించింది. భారత్ బంగారం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నందున ఇది చాలా ముఖ్యమైనది. జొన్నగిరి బంగారు ప్రాజెక్ట్ ఏటా 750 కిలోగ్రాముల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తోంది.

Gold: దేశానికి ప్రతి ఏటా 1000 కిలోల బంగారం ఇవ్వనున్న ఏపీ.. త్వరలోనే ఉత్పత్తి స్టార్ట్..
India's First Private Gold Mine In Andhra Pradesh
Krishna S
|

Updated on: Sep 18, 2025 | 7:52 PM

Share

దేశంలోనే మొదటి ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరిలో పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించనుంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ విషయాన్ని తెలిపారు. సంవత్సరానికి దాదాపు 1,000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. జొన్నగిరిలో ఈ బంగారు గనిని అభివృద్ధి చేస్తున్న జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌లో డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్‌కు వాటా ఉంది. DGML అనేది BSEలో జాబితాలో ఉన్న ఏకైక బంగారు అన్వేషణ సంస్థ.

ఈ గని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి మరియు పగడిరాయి గ్రామాల సమీపంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే పర్యావరణ అనుమతులు లభించాయి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో సంవత్సరానికి 1.5 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ కొత్త గని ప్రారంభమైతే దాదాపు ఒక టన్ను బంగారం అదనంగా ఉత్పత్తి అవుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా సహాయపడుతుంది.

జోన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ జూన్, జూలై నెలల్లో పర్యావరణ అనుమతులను పొందిందని, ఇప్పుడు రాష్ట్ర అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ తెలిపారు. ప్లాంట్ యొక్క సాంకేతిక పనులు జరుగుతున్నాయని, పూర్తి స్థాయి ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్ మొదట సంవత్సరానికి దాదాపు 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని, రెండు నుండి మూడు సంవత్సరాలలో ఈ ఉత్పత్తిని 1,000 టన్నులకు పెంచుతామని హనుమ ప్రసాద్ వివరించారు. ఈ గని ప్రారంభం కాగానే దేశం యొక్క ప్రస్తుత బంగారు ఉత్పత్తికి మరో టన్ను అదనంగా చేరుతుందని ఆయన తెలిపారు.

2003లో ప్రారంభమైన DGML, భారత్‌తో పాటు కిర్గిజ్‌స్థాన్, ఫిన్లాండ్, టాంజానియాలో కూడా మైనింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ కొత్త బంగారు గని దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా దిగుమతుల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..