
దేశ ప్రజలతో మమేకం కావలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీబాత్ అనే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ప్రతీ నెల చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రేడియో ద్వారా దేశ ప్రజలతో ముచ్చటిస్తారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలపడంతో పాటు దేశంలో పలువురు ప్రముఖుల గురించి ప్రస్తావిస్తుంటారు ప్రధాని. ఈ కార్యక్రమంపై ప్రజల్లోనూ రోజురోజుకీ ఆసక్తి పెరిగింది. ప్రధాని ఏ విషయం గురించి మాట్లాడుతారని దేశమంతా ఎదురు చూస్తుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే మన్ కీ బాత్ కార్యక్రమం తాజాగా 100వ ఎపిసోడ్‌కు చేరువైంది. ఏప్రిల్ 30వ తేదీన జరిగే ఎపిసోడ్‌తో 100వ ఎపిసోడ్‌కు చేరుకోనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రూ.100 కాయిన్ను విడుదల చేయనున్నారు. కాగా మన్ కీ బాత్‌లో ప్రధాని దేశంలో ఉన్న పలు ప్రాంతాలు, కొందరు వ్యక్తుల గురించి ప్రస్తావించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మోదీ ఎవరి పేర్లను ప్రస్తావించారు.? మన్ కీ బాత్ ఏపీకి సంబంధించి ఎలాంటి వివరాలను దేశ ప్రజలతో పంచుకున్నారు.? ఇప్పుడు చూద్దాం..
* విజయనగరం జిల్లాలో వయోజన విద్యను ప్రోత్సహించేందుకు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన కృషికిగాను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రశంసలు కురిపించారు.
* వాతావారణ వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తూ రైతులకు అర్థమయ్యేలా స్థానిక భాషలో సమాచాచరం అందిస్తున్న ప్రముఖ వాతావారణ నిపుణుడు సాయి ప్రణీత్‌ను మన్ కీ బాత్ 79వ ఎపిసోడ్‌లో ప్రశంసించారు.
* విజయవాడకు చెందిన శ్రీనివాసా పడకండ్ల అనే వ్యక్తి ఆటో మొబైల్ సంబంధిత వ్యర్థ పదార్థాలతో కళాఖండాలను తీర్చిదిద్దుతున్నాడు. ప్రధాని మన్ కీ బాత్‌లో శ్రీనివాసా పేరును ప్రస్తావించారు, ఆయన ప్రతిభను ప్రశంసించారు కూడా.
* ఇక ప్రధాని ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మరో వ్యక్తి పేరు వెంకట్. విశాఖపట్నానికి చెందిన వెంకట్ ఆత్మనిర్భర్ భారత్ చార్ట్స్‌ను రూపొందించినందుకు గాను ప్రధాని మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు.
* స్వచ్ఛ భారత్ మిషన్‌కు ప్రచారం కల్పించినందుకు గాను రామోజీ రావును ప్రధాని మన్ కీ బాత్‌లో ప్రశంసించారు. రామోజీ రావు వ్యక్తిగతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నారన్నారని, ఆయన వయసులో పెద్దవారైనా యువకుడిలా పని చేస్తున్నారన్నారని పొగిడారు.
* ఏపీలోని నంద్యాలలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించిన కేవీ సుబ్బా రెడ్డిని కూడా ప్రధాని మన్ కీ బాత్ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు మిల్లెట్స్ చేరువకావడంలో ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.
* ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డిపై కవిత రాసిన విజయదుర్గపై కూడా ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసలు కురిపించారు.
* ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన రామ్ భూపాల్ రెడ్డి అనే వ్యక్తి తన రిటైర్‌మెంట్ అనంతరం వచ్చిన రూ. 25 లక్షలతో 100 సుకన్య సమృద్ధి ఖాతాలను తెరిపించారు. ఈయన చేసిన గొప్ప పనికి ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రశంసలు కురిపించారు.
* ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, చిత్తూరు జిల్లాల్లో పండించే బంగినపల్లి మామిడి పండ్లను దక్షిణ కొరియాకు ఎగుమతి చేస్తారనే విషయాన్ని ప్రధాని మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రస్తావించారు.
* భూగర్భ జలాలను పెంచే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన నీరు ప్రగతి కార్యక్రమాన్ని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన ప్రధాని కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..