AP Tourism: అందమైన నౌక చుట్టూ.. ఎక్కడినుంచో కొట్టుకొచ్చింది.. కాంట్రవర్శీకి కేరాఫ్‌గా నిలిచింది

| Edited By: Ravi Kiran

Mar 09, 2022 | 10:47 AM

Andhra Pradesh Tourism: అందమైన నౌక చుట్టూ వివాదాలు ఒక్కొక్కటిగా అల్లుకుంటున్నాయి. ఎక్కడినుంచో కొట్టుకొచ్చి.. కాంట్రవర్శీకి కేరాఫ్‌గా నిలిచింది.

AP Tourism: అందమైన నౌక చుట్టూ.. ఎక్కడినుంచో కొట్టుకొచ్చింది.. కాంట్రవర్శీకి కేరాఫ్‌గా నిలిచింది
Boat
Follow us on

Andhra Pradesh Tourism: అందమైన నౌక చుట్టూ వివాదాలు ఒక్కొక్కటిగా అల్లుకుంటున్నాయి. ఎక్కడినుంచో కొట్టుకొచ్చి.. కాంట్రవర్శీకి కేరాఫ్‌గా నిలిచింది. అదే బంగ్లాదేశ్‌కు చెందిన మా ఎంవీ కమర్షియల్ షిప్. భారీ సరుకు రవాణాకు అత్యుత్తమైంది. 10 నెలల క్రితం సరుకు ట్రాన్స్‌పోర్ట్‌ చేస్తున్న క్రమంలో.. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. బీభత్సమైన గాలులతో యాంకర్లు విడిపోయాయి. దీంతో ప్రయాణం కొనసాగించలేక విశాఖ తెన్నేటి తీరం చేరింది. ఇసుక తిన్నెలు, రాళ్ల మధ్య చిక్కుకుపోయింది. అయితే, సముద్రంలో నిలిపి ఉంచడానికి వాడే యాంకర్లు పాడవడంతో.. నౌకలో సమస్యలు తలెత్తాయి. షిప్ ఓనర్ దీన్ని తరలించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. చివరకు విలువైన సామగ్రిని తీసుకెళ్లి.. నౌకను వదిలేశాడు ఓనర్. బంగ్లాదేశ్‌కి చెందిన ఇన్సూరెన్స్ ఏజెన్సీ దీనికి సంబంధించి యజమానికి క్లెయిమ్ ఇచ్చి ఆ నౌకను నాలుగున్నర కోట్లకు ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించింది. అయితే ఈ నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ అయింది. కోటీ 25 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. PPP మోడ్‌లో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా అభివృద్ధి చేసి షోర్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఇచ్చేందుకు టూరిజం శాఖ పరస్పర అంగీకారం కుదుర్చుకుంది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందంపై తెలుగు యువత అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రమాదకర రసాయనాలు వెదజల్లే షిప్‌ను కోట్ల రూపాయలు పెట్టి ఎలా కొనుగోలు చేస్తుందంటూ ధర్నాకు దిగింది. మరోవైపు షిప్‌ను ప్రైవేట్ వ్యక్తులు కొని రెస్టారెంట్‌ పెట్టేందుకు రూల్స్ అంగీకరించవంటోంది రాష్ట్ర పర్యాటక శాఖ. అందుకే నాలుగున్నర కోట్లు చెప్పిన షిప్‌ని కోటిన్నరకు కొన్నామని వివరణ ఇచ్చింది.

ఫ్లోటింగ్ రెస్టారెంట్‌తో సరికొత్త అనుభూతి..
ఇదిలాఉంటే.. అప్పుడు సముద్రంలో చిక్కుకున్న నౌక ఇప్పుడు అందంగా ముస్తాబయ్యే పనిలో ఉంది. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసి పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి పంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరి లోకల్‌గా వస్తున్న విమర్శలతో సర్కార్ వెనక్కి తగ్గుతుందా? టూరిజం అభివృద్ధి పేరుతో ముందుకెళ్తుందా అన్నది చూడాలి.

Also read:

Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!

Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!

Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..