Weather Forecast: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ఆ జిల్లాల ప్రజలకు చుక్కలే.. ఐఎండీ సీరియస్ వార్నింగ్..

|

Apr 12, 2023 | 10:35 PM

ఎండలు మండిపోతున్నాయ్.. ఎండ వేడిమి దెబ్బకు పెద్ద పెద్ద బండరాళ్లే పగిలిపోతున్నాయ్. మరి సామాన్యులమైన మనమెంత. మాడు పగిలిపోతుంది. ఆ మధ్య రెండు రోజులు వర్షాలు కురిసి కాస్త ఊరటనిచ్చినా.. ఆ తరువాత పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది.

Weather Forecast: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ఆ జిల్లాల ప్రజలకు చుక్కలే.. ఐఎండీ సీరియస్ వార్నింగ్..
Heatwave Alert
Follow us on

ఎండలు మండిపోతున్నాయ్.. ఎండ వేడిమి దెబ్బకు పెద్ద పెద్ద బండరాళ్లే పగిలిపోతున్నాయ్. మరి సామాన్యులమైన మనమెంత. మాడు పగిలిపోతుంది. ఆ మధ్య రెండు రోజులు వర్షాలు కురిసి కాస్త ఊరటనిచ్చినా.. ఆ తరువాత పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. జనాలు బయటకు రావాలంటేనే జడుసుకునే పరిస్థితి నెలకొంది. తాజాగా రాబోయే రెండు రోజులకు సంబంధించి వాతావరణ పరిస్థితుల వివరాలను వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ. ఎండలు మండిపోతాయని, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ విడుల చేసిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

గురువారం ఏపీలో 126 మండలాల్లో, శుక్రవారం 108 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీడ ప్రాంతాల్లో ఉండాలని, మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని సూచించారు. ఏం పనులు ఉన్నా.. ఉదయం, సాయంత్రం చూసుకోవాలని సూచించారు.

గురువారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(126):

అల్లూరి జిల్లా 8, అనకాపల్లి 17, తూర్పు గోదావరి 13, ఏలూరు 4, గుంటూరు 6, కాకినాడ 11, కోనసీమ 1, కృష్ణా 6, నంద్యాల 1, ఎన్టీఆర్ 17, పల్నాడు 2, మన్యం 12, శ్రీకాకుళం 5, విశాఖ 2, విజయనగరం 17, వైయస్సార్ జిల్లాలోని 4 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..