Heat Waves: తెలుగు ప్రజలకు అలెర్ట్.. పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్‌, మేలో ఎండలు మరింత తీవ్రం.. వడగాలులూ ఎక్కువే..

|

Mar 05, 2024 | 6:47 AM

ఏపీలో మార్చి నుంచే తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఏప్రిల్‌ మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని తెలిపింది. తీవ్రమైన వడగాల్పుల కారణంగా ప్రజలు వడదెబ్బబారిన పడే ప్రమాదం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Heat Waves: తెలుగు ప్రజలకు అలెర్ట్.. పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్‌, మేలో ఎండలు మరింత తీవ్రం.. వడగాలులూ ఎక్కువే..
Heat Waves
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఏప్రిల్‌, మేలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావంతో మార్చిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయని, ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గతేడాది మార్చ్‌ మొదటి వారంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే… ఇప్పుడు సగటున 35 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. ఎల్‌నినో కారణంగా ఇలా జరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 10 రోజులపాటు తెలంగాణలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఏపీలో మార్చి నుంచే తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఏప్రిల్‌ మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని తెలిపింది. తీవ్రమైన వడగాల్పుల కారణంగా ప్రజలు వడదెబ్బబారిన పడే ప్రమాదం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వడగాలుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపాలని అధికారులు నిర్ణయించారు. ఎండలపై సమాచారం కోసం విపత్తు నిర్వహణ సంస్థలో 112, 1070, 18004250101 టోల్‌ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తీవ్రంగానూ, అల్లూరి, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

భూమధ్య రేఖకు ఆనుకుని పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న ఎల్‌నినో పరిస్థితులు వేసవి చివరి వరకూ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పసిఫిక్‌లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగా ఉండనున్నందున ఆ దిశగా వచ్చే గాలులతో దేశంలో మార్చి నుంచి మే నెల వరకూ మూడు నెలలు ఎండలు తీవ్రంగా ఉంటాయి. అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. ప్రత్యేకించి మార్చిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలో వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..