వచ్చే 24 గంటల్లో అతి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ IMD హెచ్చరిక!
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి రుతుపవనాల చురుకుగా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు కేరళ వైపుగా నైరుతి రుతుపవనాలు దూసుకొస్తున్నాయి..

అమరావతి, మే 22: ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం (మే 21) పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి ప్రభావతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి రుతుపవనాల చురుకుగా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
మరోవైపు కేరళ వైపుగా నైరుతి రుతుపవనాలు దూసుకొస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 52మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక ఈ రోజు చకూడా ఏపీలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా, ఎన్టీఆర్, పన్నారు. నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు కురిసే అవకాశం ఉంది.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిన్న బుధవారం రాత్రి 7 గంటల సమయానికి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 5మిమీ, అనంతపురం జిల్లా చిన్న మూష్టములో 51.5 మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 50మి.మీ, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 48.మిమీ. కృష్ణా జిల్లా గిలకలడిందిలో 17మిమీ, 43 ప్రాంతా ల్లో 30మిమీరు పైగా వర్షపాతం నమోదైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




