AP Weather Alert: ఏపీలో వీస్తున్న నైరుతిగాలులు.. అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీలో వాతావరణం రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది.
AP Weather Alert: దక్షిణ ఛత్తీస్‌గఢ్.. దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భపై ఉన్న వాయుగుండం దాదాపు వాయువ్య దిశగా కదిలి ఈరోజు అనగా 12 సెప్టెంబర్ 2022 0830 గంటలకు ఆగ్నేయ మధ్యప్రదేశ్ & పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడన ప్రాంతంగా బలహీనపడిందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తీవ్ర అల్పపీడనము మధ్యప్రదేశ్ మీదుగా వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశముంది. ఋతుపవన ద్రోణి సగటు సముద్ర మట్టానికి ఇప్పుడు జైసల్మేర్, ఉదయపూర్, భోపాల్ మరియు ఆగ్నేయ మధ్యప్రదేశ్ & పరిసర ప్రాంతాలలో బాగా గుర్తించబడిన అల్పపీడన కేంద్రం గుండా ప్రయాణిస్తూ , భటపరా, ఝర్సుగూడ, బాలాసోర్ .. అక్కడి నుండి తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించిందని తెలిపింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీలో వాతావరణం రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు , ఎల్లుండి (సెప్టెంబర్ 14వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈ రోజు ,రేపు , ఎల్లుండి (సెప్టెంబర్ 14వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ: ఈ రోజు ,రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 14వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..