Andhra News: బాత్రూంలోకి వెళ్లిన బాలుడు.. ఎంతకీ రాకపోవడంతో..
ఆ బాలుడికి 13 ఏళ్లే.. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలుడు.. తాత దగ్గర ఉంటున్నాడు.. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవాడు.. ఈ క్రమంలోనే దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. షూలేస్ తో ఆకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది.. అసలేం జరిగిందనేది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ బాలుడికి 13 ఏళ్లే.. ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవాడు.. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలుడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. షూలేస్ తో ఆకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది.. ఈ దారుణ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.. పదముడేళ్ల ఆరుష్ అమన్ షూ లేస్‌తో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.. తాత దగ్గర ఉంటున్న అమన్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.. ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై చనియినట్టు విచారణలో తేలింది.
ఫోర్త్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుష్ అమన్.. విశాఖలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో ఇద్దరు విడిపోయారు. వేరే రాష్ట్రాల్లో ఉంటున్న తల్లి.. తన కొడుకును విశాఖ అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీలో ఉన్న తాత, అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచింది.. ఏమైందో ఏమో కానీ.. బాత్రూంలో ఉరి వేసుకున్నాడు.
బాత్రూంలోకి వెళ్లి అమన్ ఎంతకు రాకపోవడంతో వెళ్లి చూసే సరికి.. మెడకు షూ లేస్, ట్రాక్ ప్యాంట్ తాడు చుట్టుకుని విగత జీవిగా పడి ఉన్నాడు. స్థానికులు సహకారంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే లాగానే అప్పటికే ఊపిరి పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
తాత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. దర్యాప్తులో.. బాలుడు ఆన్లైన్ గేమ్స్, హర్రర్ వీడియోలు చూస్తుంటాడని తేలింది. కారణం ఏంటనేది ఇంకా తేలాల్సి ఉంది. మనవడు మృతితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..