నైరుతి ఋతుపవనాలు ఏపీలో చురుగ్గా విస్తరిస్తున్నాయి. మరింత ముందుకు కదిలేందుకు అనుకూల అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొంత భాగానికి రుతుపవనాలు విస్తరించాయి. రెండు మూడు రోజుల్లో ఏపీతో పాటు తెలంగాణలో కూడా పూర్తిగా విస్తరించనున్నాయి. ఇక కోస్తాకు అనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఐదు రోజుల వరకు ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం.. పిడుగుల పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..