AP Weather Report: కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం తెలంగాణపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తుతో పడమర వైపు వంగి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ/నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేసిన వాతావరణ రిపోర్ట్ ప్రకారం.. ఇవాళ ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు ఉత్తరకోస్తా్ంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రాలో ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also read: