Vizag: పైకేమో అదొక వస్త్ర దుకాణం.. తీరా లోపలకెళ్లి చూడగా దిమ్మతిరిగిపోయింది

| Edited By: Ravi Kiran

Aug 09, 2024 | 12:41 PM

అది విశాఖలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఓ వస్త్ర దుకాణం. రకరకాల రంగు రంగుల వస్త్రాలు. కస్టమర్లు వస్తూపోతూ ఉంటారు. బిజినెస్ కూడా పరవాలేదు. కేవలం అక్కడకు వస్త్రాలు కొనేందుకు వస్తున్నారా..? అన్న సందేహం మొదలైంది పోలీసులకు.

Vizag: పైకేమో అదొక వస్త్ర దుకాణం.. తీరా లోపలకెళ్లి చూడగా దిమ్మతిరిగిపోయింది
Ap News
Follow us on

అది విశాఖలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఓ వస్త్ర దుకాణం. రకరకాల రంగు రంగుల వస్త్రాలు. కస్టమర్లు వస్తూపోతూ ఉంటారు. బిజినెస్ కూడా పరవాలేదు. కేవలం అక్కడకు వస్త్రాలు కొనేందుకు వస్తున్నారా..? అన్న సందేహం మొదలైంది పోలీసులకు. దీంతో కూపి లాగారు. కీలక సమాచారం అందిన తర్వాత మెరుపు దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. తమతో పాటు డ్రగ్ కంట్రోల్ అధికారులకు తీసుకెళ్లారు. లోపల వెళ్లి తనకి చేస్తే.. వామ్మో.. అక్కడ వస్త్రాల వ్యాపారంతో పాటు..

వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 90వ వార్డు.. భాజీ జంక్షన్ మెయిన్ రోడ్డు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఉంది. దుకాణ సముదాయాలతో అక్కడ కస్టమర్లతో పోతుంది. అక్కడే ఉంది కేకే సిల్క్స్ అనే ఒక వస్త్ర దుకాణం. నిత్యం కస్టమర్లు వాట్సాప్‌లోకి వెళ్లి వస్త్రాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఆ షాప్‌పై ఎవరికో చిన్న అనుమానం వచ్చింది. టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఉప్పందింది. దీంతో రంగంలోకి దిగిపోయారు పోలీసులు. కూపి లాగితే.. అక్కడ అనధికారికంగా మెడికల్ షాపుల్లో విక్రయించాల్సిన మందులను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు కూడా సమాచారం అందించి మెరుపు దాడులు చేశారు. తనిఖీల్లో అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే వస్త్ర దుకాణంలో ఏకంగా స్లీపింగ్ పిల్స్, అబార్షన్ షీట్లతోపాటు, లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందులు కూడా ఉండడం ఆశ్చర్యం కలిగించింది. విలువ చేసే ఆల్ఫ్రజోలం, స్లీపింగ్ పిల్స్‌తో పాటు, సిల్డేనాఫీల్ సిట్రేట్ టాబ్లెట్లను సీజ్ చేశారు. షాపు యజమాని మళ్లీపూడి హరికృష్ణపై కేసు నమోదు చేశారు అధికారులు. నిషేధిత మందులు అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచామని.. నిబంధనకు ఉల్లంఘించినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు అధికారులు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..