మేమేం తక్కువ అంటూ ముందుకొచ్చిన ఐఏఎస్‌ల సతీమణులు.. ఇంతకీ వారేం చేశారంటే..

Vijayawada News: ఏపీలోని 26 జిల్లాల్లో డిఓడబ్ల్యుఎ సంయుక్తంగా రాష్ట్రంలో 7.96 లక్షలకు పైగా మొక్కల్ని నాటించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా 2,22,222 మొక్కల్ని నాటి బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలోనూ, 2 లక్షల మొక్కల్ని నాటి చిత్తూరు జిల్లా ద్వితీయ స్థానంలోనూ నిలిచాయి. ఐసోవా అధ్యక్షురాలు.. మొక్కల్ని నాటేందుకు సిఆర్డీయే, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అందించిన సహకారం పట్ల ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

మేమేం తక్కువ అంటూ ముందుకొచ్చిన ఐఏఎస్‌ల సతీమణులు.. ఇంతకీ వారేం చేశారంటే..
Ias Officers Wives

Edited By: Sanjay Kasula

Updated on: Jul 28, 2023 | 9:01 PM

విజయవాడ, జూలై 28: ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఐసోవా సభ్యులు మొక్కలు నాటారు. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల భార్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలోని 26 జిల్లాల్లో డిఓడబ్ల్యుఎ సంయుక్తంగా రాష్ట్రంలో 7.96 లక్షలకు పైగా మొక్కల్ని నాటించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా 2,22,222 మొక్కల్ని నాటి బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలోనూ, 2 లక్షల మొక్కల్ని నాటి చిత్తూరు జిల్లా ద్వితీయ స్థానంలోనూ నిలిచాయి. ఐసోవా అధ్యక్షురాలు పద్మప్రియా జవహర్ రెడ్డి, కార్యదర్శి శ్రీమతి పద్మవల్లీ కృష్ణబాబు, సంయుక్త కార్యదర్శి శ్రీమతి శ్రీదేవి అరుణ్ కుమార్, కోశాధికారి శ్రీమతి హేమా మురళీధర్ రెడ్డి లతోపాటు ఆరుగురు కోర్ కమిటీ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక్కొక్క సభ్యురాలు 3 నుండి 4 జిల్లాలను ఎంచుకుని డిఓడబ్ల్యుఎ తో సమన్వయం చేసుకోవడం ద్వారా మొక్కల్ని నాటే కార్యక్రమానికి నాంది పలికారు. ఐసోవా పద్మప్రియా జవహర్ రెడ్డి సూచనలు, సలహాల మేరకు సమాజానికి ఫలాలనిచ్చే మామిడి, కొబ్బరి, నేరేడు, చింత, జామ, సీతాఫలం వంటి మొక్కల్ని, నీడను, ఆక్సిజన్ ను అందించే రావి, వేప, మారేడు, గానుగ వంటి మొక్కల్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో 7.96 లక్షలకు పైగా మొక్కల్ని నాటించారు.

ప్రత్యేకంగా విజయవాడ నగరంలో ఐసోవా వారు మధురానగర్ వద్ద, బుడమేరు గట్ల మీద వంద మొక్కల్ని, ప్రభుత్వ సిద్ధార్ధ వైద్య కళాశాల విజయవాడ ఆవరణలో 50 మొక్కల్ని నాటించి పర్యావరణ పరిరక్షణలో తమ వంతు కర్తవ్యాన్ని చాటుకున్నారు. అంతే కాక ఐసోవా కార్యాలయ ఆవరణలో వివిధ జాతుల మొక్కల్ని స్థానికులకు ఐసోవా సభ్యులు ఉచితంగా పంపిణీ చేశారు. మొక్కల్ని నాటేందుకు సిఆర్డీయే, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అందించిన సహకారం పట్ల ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం