AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోని భార్య.. పిల్లలకు తెలియకుండా భర్త ఏం చేశాడంటే..

కడప జిల్లాలో వరుస హత్యకేసులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన మైనర్‌ బాలిక హత్య ఘటన నుంచి జిల్లా వాసులు తేరుకోకముందే మరో హత్య జరిగింది. వివాహేతర సంబంధానికి దూరంగా ఉండాలని భర్త పదే పదే హెచ్చరించిన భార్య తీరు మార్చుకోకపోవడంతో ఆగ్రహించిన భర్త ఆమెను గొంతుకోసి హత్యచేసి.. ఆ తర్వాత మృతదేహాన్ని అడవిలో పడేశారు. తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Andhra News: ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోని భార్య.. పిల్లలకు తెలియకుండా భర్త ఏం చేశాడంటే..
Crime
Anand T
|

Updated on: Jul 20, 2025 | 7:41 AM

Share

ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న ఘటనల్లో దాదాపు 90శాతం వివాహేతర సంబంధాలకు ముడిపడినవే ఉంటున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు గుర్తించిన భర్త ఆగ్రహంతో ఆమెను హత్యచేసి అడవిలో పడేశాడు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. పెద్ద చీపాడు గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తికి సుజాత అనే మహిళలో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే గోపాల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండగా భార్య ఇంట్లోనూ ఉంటూ పిల్లలను చూసుకుంటుంది.

అన్యోన్యంగా సాగుతున్న వీళ్ల జీవింతంలోకి మూడో వ్యక్తి ఎంటర్‌కావడం పెను ఆనార్థాలకు దారి తీసింది. ఇంట్లో ఉంటున్న భార్య సుజాతకు కల్లూరుకు చెందిన తాపీ మేస్త్రీతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త గోపాల్.. ఈ వ్యవహారాన్ని బంధువుల దృష్టికి తీసుకెళ్లి.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పెద్దలు వాళ్లకు సర్థిచెప్పి మరోసారి ఇలా చేయొద్దని భార్యకు బుద్ది చెప్పారు. అయినా భార్య ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు.. ఇలా అయితే కుదరదని అనుకున్న భర్త గోపాల్‌ ఫ్యామిలీని హైదరాబాద్‌కు తరలించాడు. అయితే హైదరాబాద్‌ వెళ్లిన కొంత కాలానికే భార్య మళ్లీ తిరిగి స్వగ్రామం పెద్దచీపాడుకు వచ్చి యోధావిధిగా ప్రియుడు తాపీ మేస్త్రీలో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న భర్త గోపాల్‌ ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే స్వగ్రామానికి చేరుకొని ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై కత్తితో దాడి చేశాడు. దీంతో భార్య అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక సంచిలో మూటకట్టుకొని తీసుకెళ్లి సమీపంలోని అడవిలో పడేసి ఇంటికి వచ్చాడు. తర్వాతి రోజు పోలీసులకు లొంగిపోదామని అనుకొని మైదకూరు పీఎస్‌ ప్రాంతానికి వచ్చాడు. కానీ అతనికి ధైర్యం చాలకపోవడంతో తనకు తెలిసిన ఒక హెడ్‌కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. అతని లొంగిపోవాలని సూచించడంతో.. కాసేపటికే గోపాల్‌ చాపాడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గోపాల్‌ను వెంటపెట్టుకొని అడవిలోకి వెళ్లి సుజాత మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొదటి రోజు మృతదేహం లభ్యం కాకపోవడంతో ఆ తర్వాత రోజు మళ్లీ గాలించగా కుల్లిపోయిన స్థితిలో సుజాత మృతదేహాన్ని గుర్తించారు. చనిపోయి ఇప్పటికే రెండ్రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. నిందితుడు గోపాల్‌పై కేసు నమోదు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.