Andhra Pradesh: దారుణం.. ఛార్జింగ్ వైరుతో భార్యను హత్య చేసిన భర్త.. ఇంతకీ ఏం జరిగిందంటే ?

కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు కాసాయి భర్త. కట్టుకున్న భార్యను కడతేర్చడమే కాకుండా తమకు కలిగిన ఇద్దరు పిల్లల్ని అనాథలుగా మార్చేయడం.. స్థానికంగా అందర్ని కలచివేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే కృష్ణాజిల్లా తోటవల్లూరు మండలం కుమ్మమూరు గ్రామానికి చెందిన వీర్ల రామకృష్ణ అదే గ్రామానికి చెందిన రమ్యతేజను ప్రేమించాడు. ఆపై పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్నారు.

Andhra Pradesh: దారుణం.. ఛార్జింగ్ వైరుతో భార్యను హత్య చేసిన భర్త.. ఇంతకీ ఏం జరిగిందంటే ?
Ramakrishna And Ramya Teja

Edited By: Aravind B

Updated on: Aug 27, 2023 | 11:18 AM

కృష్ణా జిల్లా న్యూస్, ఆగస్టు 27:  కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు కాసాయి భర్త. కట్టుకున్న భార్యను కడతేర్చడమే కాకుండా తమకు కలిగిన ఇద్దరు పిల్లల్ని అనాథలుగా మార్చేయడం.. స్థానికంగా అందర్ని కలచివేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే కృష్ణాజిల్లా తోటవల్లూరు మండలం కుమ్మమూరు గ్రామానికి చెందిన వీర్ల రామకృష్ణ అదే గ్రామానికి చెందిన రమ్యతేజను ప్రేమించాడు. ఆపై పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్నారు. రామకృష్ణ, రమ్యతేజ దంపతులకు ఇద్దరు ఆడ సంతానం కలిగారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో మనస్పర్ధలు.. గొడవలకు కారణమయ్యాయి. రామకృష్ణ చెడు వ్యసనాలకు బానిస కావడంతో ఇరువురి మధ్య కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే రామకృష్ణ తన భార్యతో గొడవపడి ఆమెను సెల్‌ఫోన్‌ ఛార్జింగ్ వైర్‌తో మెడకు చుట్టి చంపేశాడు.

అయితే రమ్యతేజ బుకింగ్ కీపర్‌గా పని చేసేది. ఈ క్రమంలోనే వ్యసనాలకు అలవాటుపడిన రామకృష్ణ కుటుంబాన్ని పట్టించుకోకుండా ..భార్యను అనుమానిస్తూ వచ్చాడు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రమ్యతేజ తల్లిదండ్రులు అల్లుడు రామకృష్ణపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయినప్పటికి తీరు మార్చుకోని రామకృష్ణ శనివారం మరోసారి భార్య రమ్యతేజతో గొడవపడ్డాడు. ఆ కోపంలోనే ఆమెను ఛార్జింగ్ వైర్‌తో మెడకు ఉరివేసి చంపేశాడు. భార్య రమ్యతేజను హత్య చేసిన అనంతరం ఎలాంటి బెరుకు లేకుండా తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి చేసిన నేరం ఒప్పుకొని లొంగిపోవడం గమనార్హం. తల్లి విగతజీవిగా పడి ఉండటం ఇద్దరు పిల్లలు ఆమెను చూస్తూ రోదిస్తున్న ఘటన స్థానికుల్ని కంటతడి పెట్టించింది.

కూతుర్ని కోల్పోయిన రమ్యతేజ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈహత్యపై కేసు నమోదు చేసుకున్న తోటవల్లూరు పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు దర్యాప్తు పూర్తయ్యాక చెబుతామని తెలిపారు. ప్రేమించేటప్పుడు అమ్మాయికి ఎన్నో మాటలు చెప్పే కొందరు అబ్బాయిలు.. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లను వేధింపులకు గురి చేస్తుంటారు. కొందరు కట్న, కానుకల కోసం మరికొందరు వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాల్ని కూల్చుకుంటున్నారని కొంతమంది స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. వాస్తవానికి వివాహం జరిగిన తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు రావడం సహజమే. అయితే వీటిని సర్థుకుపోతూ కొంతమంది కలిసి ఉంటారు. మరికొందరు విడిపోతుంటారు. మరోవైపు ఈ మధ్య భార్య లేదా భర్త ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. లవ్ మ్యారెజ్ చేసుకున్న లేదా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..