Wife Killed Husband: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిద్రిస్తున్న భర్తపై ఓ మహిళ పెట్రోల్ పోసి నిప్పంటించింది. దాంతో తీవ్రంగా గాయపడ్డ అతను.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరవారిపాలెంలో మద్దమాల చెంచయ్య దంపతులు జీవనం సాగిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా చెంచయ్యకు, అతని భార్యకు మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాత్రి ఇంటికి వచ్చిన చెంచయ్య.. మంచంలో నిద్రపోయాడు. అతని పడుకున్నది గమనించిన అతని భార్య.. చెంచయ్యపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. ఆ మంటల్లో చిక్కుకున్న చెంచయ్య తనను కాపాడాలంటూ ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీశాడు. అది గమనించిన స్థానిక ప్రలు.. వెంటనే 108కి సమాచారం అందించారు. అనంతరం చెంచయ్యను నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే తీవ్రంగా గాయపడ తీవ్రప్రాణాపాయంలో ఉన్న చెంచయ్యను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు.
అయితే మార్గం మధ్యలోనే చెంచయ్య చనిపోయాడు. కాగా, చెంచయ్యకు నిప్పు అంటించిన అతని భార్య ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులు ఆమెను వెతికి పట్టుకున్నారు. కాగా, బాధిత చెంచయ్య చనిపోవడానికి ముందు ఆస్పత్రిలో పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. తన భార్యకు, తనకు మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండేవని పోలీసులకు చెంచయ్య తెలిపాడు. అంతేకాదు.. తన భార్యకు వేరే వారితో అక్రమ సంబంధం ఉందనే అనుమానించానని, ఆ విషయంలో తమకు రోజూ గొడవలు జరిగేవన్నాడు. ఆ కారణంగానే తన భార్య తనపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిందని చెంచయ్య పోలీసులకు వివరించాడు. ఈ స్టేట్‌మెంట్ ఇచ్చిన కాసేపటికే చెంచయ్య చనిపోయాడు. ఇదిలాఉంటే.. చెంచయ్యను హత్య చేసిన అతని భార్యపై నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ALso read: