శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్నో జీవరాసులు. అందులో పాములలి ప్రత్యేక స్థానం. వివిధ రకాల విష సర్పాలతో పాటు తిరుమల కొండల్లో మాత్రమే కనిపించే అరుదైన పాములు కూడా ఉన్నాయి. అందుకే విశేష శేషాచలాన్ని బయో స్పియర్ రిజర్వ్ ఫారెస్ట్ గా కూడా కేంద్రం గుర్తించింది. రకరకాల పాములు సందడి చేయడం తిరుమలలో సర్వసాధారణంగా మారిపోయింది. తిరుమలలోని పలు ప్రాంతాలు, భక్తులు స్థానికులు వసతి ఉండే చోట్ల పాములు కనిపించడం సర్వసాధారణంగా మారింది.
దాదాపు 8 అడుగుల కు పైగా ఉన్న పాముని గుర్తించిన గార్డెన్స్ సిబ్బంది భాస్కర నాయుడుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆయన అక్కడికి వాలి పోయాడు. అక్కడున్న 8 అడుగుల జెర్రిపోతుతో పాటు రింగ్ రోడ్ లోని డ్రైనేజీ వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న మరో నాలుగు అడుగుల పొడవైన నాగుపామును కూడా భాస్కర్ నాయుడు చాకచక్యంగా పట్టుకున్నాడు. ఇలా రెండు విష సర్పాలను పట్టుకోవడంతో అక్కడున్న భక్తులు ఊపిరి తీసుకున్నారు. రెండు పాములను దట్టమైన అడవిలో వదిలి పెట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..