AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSRTC Jobs: ఎలాంటి రాత పరీక్ష లేకుండా RTCలో 606 కొలువులకు నోటిఫికేషన్‌.. అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా APSRTC కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అకడమిక్ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు బుధవారం నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

APSRTC Jobs: ఎలాంటి రాత పరీక్ష లేకుండా RTCలో 606 కొలువులకు నోటిఫికేషన్‌.. అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక
Representative Image
Srilakshmi C
|

Updated on: Nov 06, 2024 | 7:39 AM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ).. విజయవాడ, కర్నూలు జోన్లలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 606 ఖాళీలను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది. ఆయా ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌లో నవంబర్‌ 20, 2024వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అర్హులైన అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఆయా ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఐటీఐ మార్కులు, సీనియారిటీ ప్రకారం అప్రెంటిస్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ కర్నూలు జోన్‌లో 295 అప్రెంటిస్ ఖాళీలు, ఏపీఎస్‌ఆర్‌టీసీ విజయవాడ జోన్‌లో 311 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ ట్రేడుల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.

  • విజయవాడ జోన్ పరిధిలోని జిల్లాలు: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి.
  • కర్నూలు జోన్ పరిధిలోని జిల్లాలు: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే..

  • కృష్ణా జిల్లాలో ఖాళీలు: 41
  • ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీలు: 99
  • గుంటూరు జిల్లాలో ఖాళీలు: 45
  • బాపట్ల జిల్లాలో ఖాళీలు: 26
  • పల్నాడు జిల్లాలో ఖాళీలు: 45
  • ఏలూరు జిల్లాలో ఖాళీలు: 24
  • పశ్చిమగోదావరి జిల్లాలో ఖాళీలు: 31
  • కర్నూలు జిల్లాలో ఖాళీలు: 47
  • నంద్యాల జిల్లాలో ఖాళీలు: 45
  • అనంతపురం జిల్లాలో ఖాళీలు: 53
  • శ్రీసత్యసాయి జిల్లాలో ఖాళీలు: 37
  • కడప జిల్లాలో ఖాళీలు: 65
  • అన్నమయ్య జిల్లాలో ఖాళీలు: 48

ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 06, 2024 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 20, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, సీనియార్టీ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.118 చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

ధ్రువపత్రాల పరిశీలించే చిరునామాలు..

  • ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, చెరువు సెంటర్‌, విద్యాధరపురం, విజయవాడ.
  • ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.