గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. అయితే ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అనేది తెలియక స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇవి ఈ కాలానికి చెందినివా లేక ప్రాచీన కాలానికి చెందినవా అని ఆరా తీస్తున్నారు.ప్రస్తుత శిల్పులు చెక్కినవా లేక డామేజ్ అయిన విగ్రహలు ఇక్కడ పడవేసారా అన్న కోణంలోనూ చర్చ జరుగుతోంది. లేదా ఎక్కడైనా కూల్చివేసిన గుడిలోని విగ్రహాలను ఇక్కడ నదిలో వదిలి పెట్టారా అన్నది తేలడం లేదు.
ఇలాంటి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెడితే దోషాలు చుట్టు కుంటాయని ప్రచారం జరుగుతోంది. అందుకే ఇలా నదిలో విగ్రహలు వదలి వెల్లారని స్థానికులలో భావిస్తున్నారు. ఈ విగ్రహాలు ఎప్పవిటో తెలియాలంటే వీటీ పై పరిశోధన జరగాల్సిన అవసరం వుంది. కృష్ణా నది లోతులలో మరిన్ని విగ్రహాలు వుండే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం