Andhra Pradesh: ఇప్పటం ప్రజలకు అండగా ఉంటాం.. అవసరమైతే దానికి కూడా వెనుకాడం.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

|

Nov 05, 2022 | 8:00 PM

రహదారులపై గుంతలను పూడ్చలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విమర్శించారు. బస్సు సౌకర్యం లేని గ్రామానికి వంద అడుగుల రోడ్డును వేస్తామంటూ పేద ప్రజల బతుకులతో ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఇప్పటం గ్రామ సందర్శన అనంతరం..

Andhra Pradesh: ఇప్పటం ప్రజలకు అండగా ఉంటాం.. అవసరమైతే దానికి కూడా వెనుకాడం.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
Pawan Kalyan
Follow us on

రహదారులపై గుంతలను పూడ్చలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విమర్శించారు. బస్సు సౌకర్యం లేని గ్రామానికి వంద అడుగుల రోడ్డును వేస్తామంటూ పేద ప్రజల బతుకులతో ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఇప్పటం గ్రామ సందర్శన అనంతరం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జనసేన పార్టీకి ఇప్పటం గ్రామం అండగా నిలబడిందనే కక్షతో, ఫాక్షన్ కు అలవాటుపడిన సీఏం కావాలని కుట్రతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే మిమ్మల్ని కాపాడడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. ప్రజలకు మీ మీద కోపం కాదని.. ఆగ్రహం వస్తోందన్నారు. మీ చేతలతో ప్రజల ఆగ్రహానికి గురి అయ్యి భస్మం అవుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 15 అడుగుల రోడ్ల విస్తరణకు మీకు మనసు రాలేదుగానీ..70 అడుగుల రోడ్డును 100 అడుగులు చేయడానికి మాత్రం అత్యవసరంగా అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ఇప్పటం గ్రామం జనసేన పార్టీకి అండగా నిలబడిందని, వారికి కష్టమొస్తే మేము మా ప్రాణాలకు తెగించి అయినా వారిని కాపాడుకుంటామని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో జనసేనకు తోడుగా నిలిచే వారిని ఎట్టి పరిస్థితిలో వదులుకోబోమన్నారు. కచ్చితంగా ఇప్పటం గ్రామస్తులకు చివరి వరకు తోడుంటామని, ఎన్ని కేసులు, మరెన్ని నిర్బంధాలు ఎదురైనా ఈ పోరాటం ఆగదన్నారు. కచ్చితంగా ఇప్పటం గ్రామస్థుల తరఫున న్యాయపోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

సజ్జల రామకృష్ణారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్

పవన్ కళ్యాణ్ హత్యకు ప్లాన్ చేశారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రభుత్వం సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను ఏదో చేయడానికి రెక్కీలు, సుపారీలు, సున్నాలు, కన్నాలు ఏవేవో ప్లాన్ చేస్తున్నారని, ఎన్ని బెదిరింపులకు దిగినా ప్రజల తరఫున తమ పోరాటం ఆగదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టంలో ఉన్న పేదవాడికి జనసేన పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య భాషలో మాట్లాడితే జనసైనికులు అలాగే మాట్లాడాలని… కాదు కూడదు అంటే వారి భాషలోనే మాట్లాడాలంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. కేసులు, బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తామంటే వాటిని ఎదుర్కోవడానికి మీతో పాటు తాను సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంతకాలం వీరి అరాచకాలకు భయపడితే అంతకాలం వీరి రాక్షసత్వానికి అంతుండదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యం పెట్టే బెదిరింపులకు ఏ మాత్రం లొంగకుండా ఇదే పద్దతిలో తెగింపుతో ముందుకు వెళ్దామని మీ అందరికి పవన్ కళ్యాణ్ ఉన్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..