ఇక ఉక్కుపాదమే.. కొందరు నేతలు గంజాయిని వ్యాపారంగా మార్చుకున్నారు: హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..

|

Jul 30, 2024 | 9:51 PM

గంజాయిని అరికట్టే విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గంజాయి నివారణ మీద ఇప్పటికే సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారని అన్నారు. ఎక్కడ ఏం జరిగిన దాని వెనుక గంజాయి ఉందని చెప్పారు. వినుకొండ ఘటన, అమ్మాయిలపై అఘాయిత్యాల వెనుక కల్తీ మద్యం లేదా గంజాయి ఉన్నట్టు తేలిందన్నారు.

ఇక ఉక్కుపాదమే.. కొందరు నేతలు గంజాయిని వ్యాపారంగా మార్చుకున్నారు: హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..
Vangalapudi Anitha
Follow us on

గంజాయిని అరికట్టే విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గంజాయి నివారణ మీద ఇప్పటికే సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారని అన్నారు. ఎక్కడ ఏం జరిగిన దాని వెనుక గంజాయి ఉందని చెప్పారు. వినుకొండ ఘటన, అమ్మాయిలపై అఘాయిత్యాల వెనుక కల్తీ మద్యం లేదా గంజాయి ఉన్నట్టు తేలిందన్నారు. ఉత్తరాంధ్రతోని ఐదు జిల్లాల్లో గత ఐదేళ్ల నుంచి గంజాయి సాగు పెరిగిపోయిందన్నారు హోంమంత్రి. నియంత్రణకు గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వం మొక్కుబడిగా కొన్ని చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేపట్టారని ఆరోపించారు. కొంతమంది రాజకీయ నేతల సహకారంతో ఇదో వ్యాపారంలా సాగిందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో గంజాయి సాగు నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం డ్రోన్, శాటిలైట్ టెక్నాలజీని వినియోగిస్తామన్నారు. చెక్‌పోస్టుల దగ్గర సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు హోంమంత్రి అనిత. ఏపీలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక నార్కొటిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని.. దీనికి ఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు. గంజాయిపై ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు.

గంజాయి సాగును అరికట్టేందుకు నార్కొటిక్ టాస్క్‌ఫోర్స్‌

ఏపీలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు హోంమంత్రి అనిత. దానికి ఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు. ఏజెన్సీలో గంజాయి పంట మీద సిసి కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. హోం మంత్రి, విద్యా శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అబ్కారీ మంత్రి కలిసి ఈ ఉపసంఘంగా పనిచేస్తోందన్నారు.

గంజాయి గురించి చెబితే రివార్డ్ ఇస్తామన్న సర్కార్

గంజాయికి సంబంధించిన వివరాలు ఇచ్చే వారికి బహుమతి ఇస్తామని మంత్రి అనిత ప్రకటించారు. దీనిపై అన్ని జిల్లాలో కూడా ఒక ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తామన్నారు. విశాఖలో గంజాయి తీసకునే వారికి అనుకూల ప్రాంతాలను గుర్తించి.. వాటి మీద పోలీసులు దృష్టి పెట్టారన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ తీసుకునే వారిని పరీక్షించి నిర్ధారించే పరికరాలు లేవన్నారు. గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేశారని అనిత ఆరోపించారు. మహిళా భద్రత మీద మరింత పటిష్టంగా పని చేస్తున్నామన్నారు. మొత్తానికి వంద రోజుల్లో గంజాయికి చెక్ పెట్టాలని నిర్ణయించిన సర్కార్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..