Andhra: దొంగలకే దొంగ..! వైన్‌ షాపులో దొంగతనం చూసి పోలీసులే షాక్.. వీడియో

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైన్ షాపులో చోరీకి వెళ్ళిన దొంగ.. వైన్ షాప్ ముందు వాచ్మెన్ కాపలా ఉన్నట్లు ప్లాన్ చేశాడు.. అనంతరం వైన్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి మరీ చోరీకి పాల్పడ్డాడు.

Andhra: దొంగలకే దొంగ..! వైన్‌ షాపులో దొంగతనం చూసి పోలీసులే షాక్.. వీడియో
Hindupur Wine Shop Theft

Edited By:

Updated on: Dec 25, 2025 | 7:58 PM

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైన్ షాపులో చోరీకి వెళ్ళిన దొంగ.. వైన్ షాప్ ముందు వాచ్మెన్ కాపలా ఉన్నట్లు అక్కడ అప్పటికప్పుడు సెటప్ ప్లాన్ చేశాడు.. అనంతరం వైన్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి మరీ చోరీకి పాల్పడ్డాడు. ఈ దొంగ ఎవరో కానీ.. హిందూపురంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఎప్పటిలా కాకుండా.. ఓ దొంగ.. కాస్త భిన్నంగా ఆలోచించి వెరైటీగా దొంగతనం చేయడం పోలీసులనే షాక్ కు గురిచేసింది..

వివరాల ప్రకారం.. స్థానిక సూర్య వైన్స్ లో దొంగతనానికి వెళ్లిన ఓ దుండగుడు.. పోలీసులకు, రోడ్డుపై వెళ్లే వారికి ఎవరికీ అనుమానం రాకుండా.. షాపు ముందు రాళ్లను పేర్చి.. వాచ్మెన్ పడుకున్నట్లుగా దుప్పటి కప్పాడు.. అనంతరం షాపు షట్టర్ పగలగొట్టి లోపలికి వెళ్లి 15 వేల రూపాయలు విలువ చేసే మద్యం బాటిళ్ళు.. 40 వేల రూపాయలు నగదు దర్జాగా దోచుకెళ్లాడు.. రాత్రివేళ పోలీస్ పెట్రోలింగ్ వచ్చినా.. షాపు ముందు వాచ్మెన్ పడుకున్నట్లుగా రాళ్ళను పేర్చి పైన దుప్పటి కప్పాడు ఈ వెరైటీ దొంగ..

వీడియో చూడండి..

పొద్దున్నే షాపు తీయటానికి వచ్చిన యజమాని వైన్ షాప్ ముందు ఎవరో పడుకుని ఉన్నారని దుప్పటి తీసి చూడగా అసలు విషయం బయటపడింది.. వైన్ షాపులో దొంగతనం చేసి.. పోలీసులను, స్థానికులను ఏమార్చిన చోరీ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. వీడెవడు రా బాబు వాచ్మెన్ ఉండగానే వైన్ షాపులో దొంగతనానికి వచ్చాడా? అనుకున్నారు అందరూ… తీరా అసలు విషయం తెలిసి దొంగ తెలివితేటలకు స్థానికులంతా అవాక్కయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..