Tomato Price: బాబోయ్ కిలో టమాటా ధర ఇంతా.. రైతుల దగ్గర నుంచి రైతు బజార్‌ల వరకు ధరలకు మళ్లీ రెక్కలు

|

Oct 08, 2021 | 7:24 AM

ఆరుగాలం కష్టించి.. పండించిన పంటలకు గిట్టుబాటు లేక రైతులు విలవిలలాడుతున్నారు... ఇదంతా గతం.. ఇప్పుడు చుక్కలను అంటుతోంది. భారీ ధరను పలుకుతోంది. 

Tomato Price: బాబోయ్ కిలో టమాటా ధర ఇంతా.. రైతుల దగ్గర నుంచి రైతు బజార్‌ల వరకు ధరలకు మళ్లీ రెక్కలు
Tomato
Follow us on

ఆరుగాలం కష్టించి.. పండించిన పంటలకు గిట్టుబాటు లేక రైతులు విలవిలలాడుతున్నారు… ఇదంతా గతం.. ఇప్పుడు చుక్కలను అంటుతోంది. భారీ ధరను పలుకుతోంది. నిన్న మొన్నటి వరకు ధర లేదని రోడ్డు మీద పారబోయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం రైతులకు లాభాలను రుచి చూపిస్తున్నాయి టమాటాలు. అయితే కొనుగోలుదారులకు చుక్కులు కనిపిస్తున్నాయి. టమాటా ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. నిన్నటి వరకు సూపర్‌ మార్కెట్‌లలో కూడా సాధారణ ధర పలికిన టమాటా..ఇప్పుడు మళ్లీ రైతుల దగ్గర నుంచి రైతు బజార్‌ల వరకు భగ్గమంటోంది. కిలో టమాటా రూ. 35 రూపాయలకు చేరింది. ఇది నగరాల్లోని సూపర్‌ మార్కెట్‌లలో పలుకుతున్న ధర కాదు. అత్యధికంగా టమాటా పండించే కర్నూలు జిల్లా పత్తికొండ టమాటా మార్కెట్‌లో రేటు.

కర్నూలు జిల్లాలో సుమారు 20 వేల హెక్టార్లకు పైగా టమాట సాగు చేస్తారు అక్కడి రైతులు. అందులో ఎక్కువగా పత్తికుంట, ఆదోని, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, తుగ్గలి, మద్దికెర ప్రాంతాల్లో టమాటాను పండిస్తారు. కాని వర్షాలు, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈసారి రైతులు టమాటా సాగుకు ఆసక్తి చూపలేదు. దీంతో పంట దిగుబడి తగ్గింది. ఉన్న కొద్ది పంటను మార్కెట్‌కి చేవడంతో గత రెండ్రోజులుగా టమాటా ధర పెరుగుతూ వస్తోంది. ఇది రైతులకు ఓ రకంగా సంతోషించే విషయమే అయినప్పటికి.. డిమాండ్‌కు సరిపడ దిగుబడి లేకపోవడంతో .. అక్కడి రైతులు నిరుత్సాహపడుతున్నారు.

ఈ ఖరీఫ్ సీజన్లో రెండు నెలలుగా వర్షాలు లేకపోడంతో టమాటా పంటలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. దీంతో టమాటా దిగుబడి బాగా తగ్గిందని రైతులు చెబుతున్నారు. దిగుబడి తగ్గడం వల్లే రేటు అమాంతం పెరిగిందంటున్నారు. ఇప్పుడు టమాటా రేటు భాగా ఉందని సంతోష పడాల్సిన అవసరం లేదంటున్నారు రైతులు. టమాటా ధర ఎప్పుడు పెరుగుతుందో ? ఎప్పుడు పడిపోతుందో తెలియని ఆందోళనలో ఉన్నారు రైతులు.

ఇవి కూడా చదవండి: PM Modi: ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన ప్రధాని మోడీ.. పీఎం కేర్స్ కింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఓ వరం..