ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా గత నెలలో అనూహ్యంగా స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ఇక ఇప్పుడు కొత్త నెల వచ్చేసింది. ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా ఆగష్టులో భారీగా సెలవులు ఉన్నాయి. రక్షాబంధన్, నాగపంచమి లాంటి పండుగలు ఈ నెలలోనే వస్తుండటంతో.. ఆయా రోజుల్లో స్కూళ్లు్ సెలవులు ఉంటాయి. మరి ఆగష్టు నెలలో పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉండనున్నాయో ఇప్పుడు చూసేద్దామా..
ఆగష్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం, ఆగష్టు 25 – వరలక్ష్మీ వ్రతం, ఆగష్టు 30 – రాఖీ పౌర్ణమి.. ఈ మూడు పండుగలకు తెలుగు రాష్ట్రాలలోని విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి. అలాగే వీటితో పాటు నాలుగు ఆదివారాలు( ఆగష్టు 6, ఆగష్టు 13, ఆగష్టు 20, ఆగష్టు 27). అటు రెండో శనివారం(ఆగష్టు 12) కూడా స్కూళ్లు సెలవు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఏపీ, తెలంగాణలలోని అన్ని పాఠశాలలకు దాదాపుగా 8 రోజులు సెలవులు ఇవ్వనున్నారు.
కాగా, రాష్ట్రాల వారీగా.. అక్కడ జరుపుకునే స్థానిక పండుగల పరంగా సెలవులు ఉండనున్నాయి. కొన్ని చోట్ల స్కూల్స్ కేవలం ఐదు రోజులు మాత్రమే పని చేయగా.. మరికొన్ని చోట్ల రెండు, నాలుగు శనివారాలు సెలవులు ఇస్తారు. అటు ప్లే-స్కూల్స్ టైమింగ్స్‌లో కూడా వేరుగా ఉంటాయి.