AP Weather: ఓరి దేవుడా.. ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

|

Oct 11, 2024 | 11:02 AM

ఏపీకి మరో రెయిన్ టెన్షన్ వచ్చి పడింది. శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి తీవ్ర వాయుగుండంగా, అది బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

AP Weather:  ఓరి దేవుడా.. ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
Andhra Weather Update
Follow us on

ఆంధ్రాలో వానలకు మళ్లీ వేళయ్యింది. రాష్ట్రంవైపు మరో తుఫాన్ దూసుకువస్తుంది. శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అతి క్రమేణ తీవ్ర వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారేందుకు చాన్స్ ఉందని, ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా  మారవచ్చని, అక్టోబర్ 17 నాటికి ఆంధ్రాలోనే తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారుల అంచనా.

వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఆస్కారముందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఒకవేళ వాయుగుండం కాస్తా తుపానుగా బలపడితే వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. తుఫన్ ఏపీ దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో తీరం దాటవచ్చని, అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుపానుపై మరింత క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు. . మరోవైపు పల్నాడు, శ్రీసత్యసాయి, ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరితో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇక శుక్రవారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, వైయస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..