బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..వచ్చే మూడు రోజులు ఆ ప్రాంతాల్లో వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండం గా మారింది. ఇది శ్రీలంకలోని ట్రింకోమలికి ఉత్తర ఈశాన్యంగా 340 కిలోమీటర్లు, తమిళనాడులోని నాగపపట్టణానికి..

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..వచ్చే మూడు రోజులు ఆ ప్రాంతాల్లో వర్షాలు
Low Prerssure

Updated on: Mar 05, 2022 | 2:45 PM

నైరుతి బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండం గా మారింది. ఇది శ్రీలంకలోని ట్రింకోమలికి ఉత్తర ఈశాన్యంగా 340 కిలోమీటర్లు, తమిళనాడులోని నాగపపట్టణానికి(Nagapattanam) తూర్పు ఈశాన్యంగా 300 కిలోమీటర్లు, పుదుచ్చేరి కి తూర్పు ఆగ్నేయంగా 300కిలోమీటర్లు, చెన్నైకు ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటలుగా 13 కి.మీ. వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. సాయంత్రానికి తమిళనాడు(Tamilanadu) తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు పొడిగా, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, కోస్తాంధ్రలో తీరంవెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు. ఏవైనా అవాంతరాలు ఎదురైతే సంబంధిత శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.

Also Read

Andhra Pradesh: ఏపీలో మరో చోట కిడ్నీ వ్యాధి డేంజర్ బెల్స్.. చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుంటున్నా..

Viral News: కాసేపట్లో పెళ్లి.. సడెన్‌గా మండపంలోకి అంబులెన్స్ ఎంట్రీ.. ఎందుకో తెలిస్తే ఫ్యూజులౌట్!

Russia-Ukraine: ఐరాసలో మాస్కో రాయబారి కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌ జాతీయవాదుల చేతిలో 3,189 మంది భారతీయులు