Rayalaseema: సీమలో క్రేజీ సీన్.. నిన్నటిదాకా చినుకు జాడనే లేదు.. ఒక్కసారిగా కుండపోత.. ఆ తర్వాత

|

Oct 22, 2021 | 10:43 AM

ఎక్కడైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులు వెళ్తారు. అదే బస్సు రోడ్డుపై నిలిచిపోతే చేసేదేం లేక పాసింజర్స్ పక్కకు తోస్తారు.. ఇప్పుడు వెరైటీగా ఒక జేసీబీ ఆర్టీసీ బస్సును తోసుకుంటూ వెళ్లింది.

Rayalaseema: సీమలో క్రేజీ సీన్.. నిన్నటిదాకా చినుకు జాడనే లేదు.. ఒక్కసారిగా కుండపోత.. ఆ తర్వాత
Hevay Rain In Anathapur
Follow us on

ఎక్కడైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులు వెళ్తారు. అదే బస్సు రోడ్డుపై నిలిచిపోతే చేసేదేం లేక పాసింజర్స్ పక్కకు తోస్తారు.. ఇప్పుడు వెరైటీగా ఒక జేసీబీ ఆర్టీసీ బస్సును తోసుకుంటూ వెళ్లింది. అవును.. అనంతపురం జిల్లా ఆత్మకూరులో జేసీబీ ఆర్టీసీ బస్సు తోసుకుంటూ వచ్చి.. వరద బారి నుంచి కాపాడింది. జిల్లాలో గత రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ప్రధానంగా అనంతపురం పరిసరాలతో పాటు పలు మండలాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. పలు ప్రాంతాల్లో పంటలు కూడా నీట మునిగాయి. అయితే ఆత్మకూరులోని ప్రధాన రోడ్డులో భారీగా వర్షం నీరు చేరింది. ఇవాళ ఉదయం ఆర్టీసీ ఆ మార్గంలో వెళ్తుండగా.. వర్షం నీరు తక్కువగా ఉందని డ్రైవర్ ముందుకెళ్లాడు. కానీ వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో నీటిలో బస్సు చిక్కుకుపోయింది. కాగా వరద బస్సు చిక్కుకుపోవడంతో ప్రయాణీకులు కాసేపు టెన్షన్ పడ్డారు. ఈ తర్వాత మోకాల్లోతు నీళ్లలోనే నడుస్తూ వచ్చి.. రోడ్డును చేరకున్నారు. చాలా సేపు ప్రయత్నించినా బస్సు మాత్రం ముందుకు కదల్లేదు. దీంతో స్థానికులు జేసీబీనీ తీసుకొచ్చి ఆర్టీసీ బస్సును ముందుకు తోసారు. అప్పుడు కానీ నీటి నుంచి బస్సు ముందుకు కదల్లేదు. మొన్నటి వరకు వర్షం కోసం చూసిన ఈ ప్రాంతంలో ఇలా బస్సులు కదల్లేనంత వర్షం రావడం స్థానికులకు కాస్త ఆశ్చర్యాన్ని కల్గించింది.

 

 

 

Also Read:  పైనుంచి చూస్తే పత్తి చేనే అనుకుంటారు.. లోపలకు దిగి చెక్ చేసిన అధికారులు షాక్

Telangana: ‘అయ్యో పాపం’ అని లిఫ్ట్ ఇస్తే.. చుక్కలు చూపించారు