Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు సెలవులు పొడిగింపు.. !

ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. వర్షాలు తీవ్రతగా ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సెలవులు పెంచే అవకాశం ఉంది.

Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు సెలవులు పొడిగింపు.. !
Schools
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 14, 2024 | 2:48 PM

అల్పపీడనం కారణంగా ఏపీ సర్కార్ అలెర్ట్ అయింది. వర్ష ప్రభావం ఉన్న జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలువలు, చెరువులు, నీటి వనరుల వద్ద అలెర్ట్‌గా ఉండి, పర్యవేక్షణ ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్​లు పంపి అలెర్ట్ చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్స్‌కు కాల్స్‌కు వెంటనే రెస్పాండ్ అవ్వాలన్నారు.

ఈ క్రమంలో  ప్రకాశం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టింది. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

భారీ వర్షాల నేపధ్యంలో నెల్లూరు జిల్లాలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు  సెలవు ప్రకటించారు. దసరా సెలవులు ముగియడంతో ఏపీలో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. వర్షం కారణంగా పలు జిల్లాల్లో నేడూ సెలవు ప్రకటించారు. రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వెదర్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్‌తో సెలవులు పొడిగించే అవకాశం లేకపోలేదు. అలాగే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దుచేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే సోమశిల జలాసానికి నీరు వచ్చే అవకాశం ఉందని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ చెప్పారు. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే 0861-2331261, 7995576699, 1077 నంబర్లకు కాల్‌ చేయాలని సూచించారు. పెన్నా పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశామని చెప్పారాయన.

ఏపీలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది విశాఖ వాతావరణ విభాగం. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుందని.. దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాలుంటాయని సూచించింది.

మరిన్న ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!