AP Rains: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. ఏయే జిల్లాలపై ప్రభావం పడనుందంటే!

ఏపీ ప్రజలకు కూల్ న్యూస్.. కానీ హెచ్చరిక కూడా. రాబోయే 3 రోజులు రాష్ట్రమంతటా పిడుగులతో పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని..

AP Rains: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. ఏయే జిల్లాలపై ప్రభావం పడనుందంటే!
Rains

Updated on: Mar 16, 2023 | 7:53 PM

ఏపీ ప్రజలకు కూల్ న్యూస్.. కానీ హెచ్చరిక కూడా. రాబోయే 3 రోజులు రాష్ట్రమంతటా పిడుగులతో పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాల ప్రకారం ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఇక భారీ వర్షాలు, పిడుగుపాటు నేపధ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

రాబోయే 3 రోజుల వాతావరణ వివరాలు:-

  1. శుక్రవారం: రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
  2. శనివారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
  3. ఆదివారం: రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.