Andhra Pradesh: ఠారెత్తిస్తున్న ఎండలు.. 6 జిల్లాల్లోని 27 మండలాలకు వడగాల్పుల అలెర్ట్.. ఇదిగో లిస్ట్

|

Apr 10, 2023 | 11:33 AM

ఏప్రిల్ నెలలో ఎండల దంచబోతున్నాయని.. మే నెలలో పీక్స్‌కు వెళ్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వడగాలుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తలు తీకుకోవాలని సూచించింది.

Andhra Pradesh: ఠారెత్తిస్తున్న ఎండలు.. 6 జిల్లాల్లోని 27 మండలాలకు వడగాల్పుల అలెర్ట్.. ఇదిగో లిస్ట్
Heat Wave Alert
Follow us on

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని ఐఎండీ వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర పెంపు చోటుచేసుకోవచ్చని వివరించింది. పది రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు తోడుకానున్నాయి.ఎందుకంటే ఏపీకి వడగాల్పుల అలెర్ట్ జారీ అయ్యింది..ఏకంగా ఆరు జిల్లాల్లో 27 మండలాలకు వడగాల్పులంటూ హెచ్చరించింది..అల్లూరి సీతారామ జిల్లాలో, మన్యంలో, కాకినాడలో , అనకాపల్లి, తూర్పుగోదావరి , ఏలూరు జిల్లాలోని పలు మండలాల్లో వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా చేసింది..

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న (27) మండలాలు ఇవే..
============

–అల్లూరి సీతారామరాజు జిల్లా (07) మండలాలు

1.అడ్డతీగల (41.7°C)

2.నెల్లిపాక (43.1°C)

3.చింతూరు (44.7°C)

4.గంగవరం (42.4°C)

5.కూనవరం (44.8°C)

6.రాజవొమ్మంగి (41.2°C)

7.వరరామచంద్రపురం (43.5°C)
============

–అనకాపల్లి జిల్లా (05) మండలాలు

8.గొలుగొండ (40.1°C)

9.కోటవురట్ల (39°C)

10.మాకవరపాలెం (39.4°C)

11.నర్సీపట్నం (39.6°C)

12.నాతవరం (40°C)
============

–తూర్పు గోదావరి జిల్లా (02) మండలాలు

13.గోకవరం (43.3°C)

14.కోరుకొండ (42.2°C)
============

–ఏలూరు జిల్లా(01)

15.కుకునూర్ (43°C) మండలం
============

–కాకినాడ జిల్లా (06) మండలాలు

16.గండేపల్లి (41.6°C)

17.జగ్గంపేట (42.6°C)

18.కిర్లంపూడి (41.7°C)

19.కోటనందూరు (39.3°C)

20.ప్రత్తిపాడు (41°C)

21.ఏలేశ్వరం (42.5°C)

============

–పార్వతీపురం మన్యం జిల్లా (06) మండలాలు

22.భామిని (41.8°C)

23.గరుగుబిల్లి (43.1°C)

24.జియ్యమ్మవలస (42.8°C)

25.కొమరాడ (41.4°C)

26.కురుపాం (42.1°C)

27.వీరఘట్టం (43°C)లలో

============

ఇలా ఈ 27 మండలాల్లో..వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది..ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది..ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే వడ దెబ్బ తగిలే అవకాశముందని హెచ్చరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..