రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు(B.Tech Student Ramya Murder Case) విచారణ పూర్తయింది. ఇవాళ తీర్పు వెలవరించనున్నట్లు గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రాంగోపాల్ ప్రకటించారు. గుంటూరులోని పరమయ్యకుంట వద్ద గతేడాది ఆగస్ట్ 15వ తేదిన హత్య జరగ్గా ఏడాది లోగానే విచారణ పూర్తయింది. గుంటూరు నగరంలో జరిగిన నల్లపు రమ్య హత్య కేసులో ప్రత్యేక న్యాయస్థానం విచారణ పూర్తయింది. పరమాయి కుంటకు చెందిన రమ్య బిటెక్ చదువుతోంది. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన కుంచాల శశికృష్ణ ప్రేమ పేరుతో రమ్యని వేధించాడు. తన ప్రేమ కాదన్నదన్న కోపంతో గత ఏడాది ఆగస్ట్ 15వ తేదిన చుట్టుపక్కల వారు చూస్తుండగానే నడిరోడ్డుపై రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య విజువల్స్ సిసి కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడు శశికృష్ణను నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేయటంతో పాటు 15రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
రమ్య శరీరంపై 8కత్తిపోట్లను వైద్యులు గుర్తించారు. సాక్షాధారాలు లభించటంతో పాటు ప్రత్యక్షంగా హత్య చూసిన వారు కూడా విచారణకు సహకరించారు. ఈ కేసులో డీఎస్పీ రవికుమార్ ని విచారణ అధికారిగా నియమించారు. ఆయన మొత్తం 36మంది సాక్షులను విచారించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి కూడా వారిలో 28మందిని విచారించారు.
ఆ తర్వాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. డిసెంబర్ 7 నుంచి మార్చి 2వ తేది వరకూ ఈ ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత ఇరువర్గాల వాదనలు వినటం ప్రారంభించి… మంగళవారంతో పూర్తి చేశారు. హత్య కేసులో కీలకమైన సిసి టివి వీడియోను న్యాయమూర్తి పరిశీలించారు. ఈనెల 29వ తేదిన తీర్పు వెలువరిస్తానని ప్రకటించారు. నిందితుడు శశికృష్ణ గుంటూర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
రమ్య హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. రాజకీయపార్టీలు రోడ్కెక్కి ఆందోళనలు నిర్వహించాయి. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కేసు విచారణ పూర్తి కావటంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి: Acharya Movie Release Live: ప్రేక్షకుల ముందుకు ఆచార్య.. కోలాహలంగా మారిన థియేటర్స్.. అభిమానుల రచ్చ
Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు