ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. జనసేన అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు కసరత్తు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పవన్ కల్యాణ్ రెండో లిస్టును ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.. టీడీపీతో పొత్తులో భాగంగా 24 సీట్లలో పోటీచేస్తున్న జనసేన.. తొలి జాబితాలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో 10మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. తిరుపతి నుంచి పోటీకి జనసేన పట్టు బడుతోంది. అంతేకాకుండా.. బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కోసం ప్రయత్నంచేస్తున్నట్లు సమాచారం.. జనసేన పరిశీలనలో ఉమ్మడి చిత్తూరు జిల్లా బలిజ నేతల పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. సరైన అభ్యర్థిని బరిలోకి దించేలా పవన్ కల్యాణ్ ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ముందస్తుగా కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తర్వాత.. మూడో జాబితాలో పోటీచేసే అన్ని స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకంటించనున్నట్లు సమాచారం..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..