హెడ్‌మాస్టర్ దాష్టీకం
పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు సహనం కోల్పోతున్నారు. చిన్నచిన్న కారణాలకే చిన్నారులపై దాష్టీకం ప్రదర్శిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో స్కూల్ హెడ్ మాస్టర్ నిర్వాకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రైమరీ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. అల్లరి చేస్తున్నారనే కారణంతో ఏకంగా చిన్నారులను కాళ్లు, చేతులు కట్టేసి ఓ మూలన పడేసింది స్కూల్ హెడ్‌మాస్టర్. ఈ ఘటన కదిరి పట్టణంలోని మశానంపేట మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగింది. కదిరి […]
పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు సహనం కోల్పోతున్నారు. చిన్నచిన్న కారణాలకే చిన్నారులపై దాష్టీకం ప్రదర్శిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో స్కూల్ హెడ్ మాస్టర్ నిర్వాకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రైమరీ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. అల్లరి చేస్తున్నారనే కారణంతో ఏకంగా చిన్నారులను కాళ్లు, చేతులు కట్టేసి ఓ మూలన పడేసింది స్కూల్ హెడ్‌మాస్టర్. ఈ ఘటన కదిరి పట్టణంలోని మశానంపేట మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగింది.
కదిరి పట్టణంలో మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో 3,5వ తరగతి చదువుతున్న పవన్, మహమ్మద్‌లు అల్లరి చేసారని తాళ్లతో చేతులు, పాదాలను కట్టేసి పడేసింది. విద్యార్థులు బంధీగా ఉన్న విషయాన్ని కొందరు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పేరేంట్స్ తమ పిల్లల పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే కట్లు విప్పదీసి అక్కున చేర్చుకున్నారు. జరిగిన ఘటనపై తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు హెడ్‌మాస్టారును నిలదీశారు. చిన్నారుల పట్ల రాక్షసంగా ప్రవర్తించిన హెడ్‌మాస్టర్ శ్రీదేవిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న కదిరి ఎంఈఓ చిన్ని కృష్ణ హుటాహుటినా పాఠశాలకు చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప్టటారు.
హెడ్‌మాస్టర్ పనితీరుపై విద్యాశాఖ అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం లేకుండా విద్యార్థులను తాళ్లతో కట్టివేసి హింసించడం చాలా దారుణమన్నారు. సమాజం మీద అవగాహన లేని 3,5 వ తరగతి చదువుతున్న చిన్నారులపై దుర్మార్గంగా వ్యవహరించడం ఉపాధ్యాయ వృత్తికి చెడ్డ పేరు వస్తుందని విమర్శించారు. రెండు రోజుల క్రితం పాఠశాలకు సరైన సమయానికి రాలేదని అదే పాఠశాలకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులపై అధికారులు మెమోలు ఇవ్వడం జరిగింది. అది మరువకముందే చిన్నారులను హింసించడం లాంటి ఘటన చోటుచేసుకోవడం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీదేవి వ్యవహార శైలి పై ఉన్నత అధికారులు స్పందించి విచారించి వెంటనే పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తాలూకా ప్రధాన కార్యదర్శి శేషం మహేంద్ర, సహాయ కార్యదర్శులు కోలా బాబు, విజయ్ ,పద్మభూషణ్ నాయక్, తనకల్లు మహేంద్ర, గణేష్, ఉపేంద్ర పాల్గొన్నారు.