బీజేపీ విషయంలో తనకు సాఫ్ట్ కార్నర్ ఏమి లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. వ్యతిరేకించే విషయాల్లో కచ్చితంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తన వైఖరిని జగన్ విస్పష్టంగా టీవీ నైన్ వేదికగా వెల్లడించారు. మతం వేరు రిజర్వేషన్లు వేరని జగన్ అన్నారు. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారన్నారు. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాదించి కేంద్రం నుంచి రావల్సిన నిధులను రాబట్టుకుంటామన్నారు. కేంద్ర ఏ ప్రభుత్వం వచ్చినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాల్సిందే అన్నారు జగన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…