AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DGP Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సీఎస్ విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చెయనున్న నేపథ్యలో.. హరీష్ కుమార్ గుప్తా నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు..

DGP Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం..
DGP Harish Kumar Gupta
Eswar Chennupalli
| Edited By: Srilakshmi C|

Updated on: Jan 30, 2025 | 7:16 AM

Share

అమరావతి, జనవరి 30: నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. పూర్తి అదనపు బాధ్యతలతో గుప్తాను డీజీపీగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావ్ ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ పొందనున్నారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎన్నికల సమయంలోనూ డీజీపీగా వ్యవహరించారు గుప్తా. 2025 ఆగష్టులో పదవీ విరమణ పొందేవరకు హరీష్ కుమార్ గుప్త డీజీపీగా కొనసాగనున్నారు.

ద్వారకా తిరుమల రావును రిలీవ్ చేసిన ప్రభుత్వం

జనవరి 31వ తేదీతో పదవీ విరమణ పొందనున్న ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావ్‌ను రిలీవ్ చేస్తూ కూటమి సర్కార్ జారీ చేసింది. ప్రస్తుతం ద్వారకా తిరుమల రావు నిర్వహిస్తున్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఆర్టీసీ వీసీ & ఎండీ పదవులనుంచీ రిలీవ్ చేస్తూ సీఎస్ విజయానంద్ బుధవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.