
ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ప్రేమగా మారింది. అదే తపస్వి పాలిట శాపంగా మారింది. సోమవారం రాత్రి.. తపస్వీ ప్రేమోన్మాది చేతుల్లో దారుణ హత్యకు గురయ్యింది. నిందితుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులకు విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న జ్ఞానేశ్వర్‌కు బీడీఎస్ చదువుతున్న తపస్వి పరిచయం అయ్యింది. ఆపై వారి పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ కొన్నాళ్లు విజయవాడలో కలిసే ఉన్నారు కూడా. ఆ క్రమంలోనే తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి సుమారు 1,40,000వేల రూపాయలు రుణం తీసుకొని బైక్ కొన్నాడు జ్ఞానేశ్వర్. సరిగ్గా ఆతర్వాత నుంచే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని పోలీసుల విచారణలో గుర్తించారు.
తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె పదే పదే కోరింది. ఆ క్రమంలో పోలీసులు తపస్వి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అంతకు ముందే విజయవాడలోని తనికెళ్లపాడులోని తన ఫ్రెండ్ రూంకి మారిపోయిన తపస్వి, జ్ఞానేశ్వర్‌ను పూర్తిగా దూరం పెట్టిందనట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. తాను ఎన్ని సార్లు ఫోన్ చేసినా తపస్వి లిఫ్ట్ చెయ్యకపోవడంతో కోపం పెంచుకున్నాడు. తపస్వి స్నేహితురాలికి ఫోన్ చేసి మాట్లాడించమన్నప్పటికీ పట్టించుకోకపోవడంతోనే కసి పెంచుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
పెళ్లి చేసుకుందామని ఎన్ని సార్లు చెప్పడానికి ప్రయత్నించినా తపస్వి పట్టించుకోకపోవడంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని జ్ఞానేశ్వర్ నిర్ణయించుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. కత్తితో పాటు 2 సర్జికల్ బ్లేడ్లు తీసుకొచ్చి సోమవారం రాత్రి ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఈ కేసులో నిందితుడు జ్ఞానేశ్వర్‌కు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం