టిప్పు టాప్ గా రెడి అవుతారు. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. టై కట్టుకుంటారు.. షూ వేస్తారు.. ఏసి బోగిల్లోనే ప్రయాణిస్తుంటారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారా.. ఏమీ లేదండి.. ఎంచక్కా దొంగతనాలు చేయడానికే ఇలా ట్రెండీ మారుతుంటారు. ఇక్క ప్రయాణించేవారిని టార్గెట్ చేస్తుంటారు. అందినకాడికి దోచుకుంటారు. ఎవరికి తెలియకుండా మాయమవుతుంటారు. ఎవరికి అనుమానం రాకుండా జారుకుంటారు. దొంగ ఎవరో కూడా అస్సలు గుర్తు పట్టకుండా వ్యవహరిస్తుంటారు. ఈ దొంగలిద్దరు మంచి స్నేహితులు కూడా అన్నింటిలో 50-50 చేసుకుంటూ రైలు ప్రయాణం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. దొరికితే కానీ వీరు దొంగలు అనేందుకు ఎలాంటి ఆదారాలు కనిపించవు.. ఎందుకంటే వీరి డాబు, దర్పం అలా ఉంటుంది మరి. ఇలాంటి ఓ చోర్ గాళ్లు అడ్డంగా దొరికిపోయారు.
పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన హర్షవర్థన్ రెడ్డి, ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన హరికృష్ణ స్నేహితులు. చదివింది ఐదో తరగతి వరకే గాని బిల్డప్ మాత్రం పిజిలు చేసిన వాళ్ళ లెవెల్లో ఉంటుంది. రిజర్వేషన్ బోగిల్లో దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తులు. రైల్వే ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలు ధరించిన వారిపై రెక్కి నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కలిగి వారిని టార్గెట్ చేస్తారు.
ప్రయాణీకులు ఆదమరిచి నిద్రపోయిన వెంటనే తమ పని కానించి ఎంచక్కా ట్రెయిన్ దిగిపోతారు. దొంగలించిన బంగారు ఆభరణాలను, విలువైన వస్తువులను విక్రయించా వచ్చిన డబ్బుతో విమానంలో గోవా వెళ్ళి జల్సా చేస్తుంటారు.
ట్రెయిన్ దొంగతనాల పై దృష్టి సారించిన రైల్వే పోలీసులకు గుంటూరు రైల్వే స్టేషన్‌లో అనుమానంగా సంచరిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. వీరివద్ద నుంచి 2.50 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
రైల్వే ప్రయాణీకులు ఇటువంటి కేటుగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అనుమానం వస్తే వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..