విద్యార్థి పరిస్థితి చూసి చలించిపోయారు.. గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్యే మాధవి..
ఆ విద్యార్ధిని పేరు.. శ్రుతి సింగ్.. నీట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 1582వ ర్యాంక్ సాధించింది. విశాఖపట్నం ఎన్ఆర్ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ లో కన్వీనర్ కోటాలో సీటు సంపాదించింది. ప్రైవేటు కాలేజ్ కావడంతో 1,76,500 రూపాయల ఫీజ్ చెల్లించాల్సి వచ్చింది.
ఆ విద్యార్ధిని పేరు.. శ్రుతి సింగ్.. నీట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 1582వ ర్యాంక్ సాధించింది. విశాఖపట్నం ఎన్ఆర్ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ లో కన్వీనర్ కోటాలో సీటు సంపాదించింది. ప్రైవేటు కాలేజ్ కావడంతో 1,76,500 రూపాయల ఫీజ్ చెల్లించాల్సి వచ్చింది. ఆర్ధికంగా అంత స్తోమత లేకపోవడంతో ఇక మెడికల్ కాలేజ్ జాయినింగ్ పై ఆశలు వదిలేసుకుంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవి గొప్ప మనసు చాటుకున్నారు. విద్యార్థిని చదువుకునేందుకు కావల్సిన డబ్బులు సర్దుబాటు చేసేందుకు ముందుకు వచ్చారు.
ఒరిస్సాకు చెందిన శ్రుతి సింగ్ కుటుంబం గుంటూరు వలస వచ్చి స్థిరపడింది. శ్రుతి సింగ్ తండ్రి కృష్ణానంద్ సింగ్ భజరంగ్ జూట్ మిల్లులో సూపర్‌వైజర్‌గా పనిచేశారు. అయితే కొన్నేళ్ల కిందట జూట్ మిల్లు లాకౌట్ ప్రకటించారు. ఆ తర్వాత అనారోగ్యంతో చనిపోయాడు. తండ్రి మరణంతో తల్లి జయంతి సింగ్ ఓ కర్రీ పాయింట్ రోజువారీ కూలీగా పనిచేస్తూ పిల్లలను చదివించింది. శ్రుతి ఆరో తరగతి నుండి పదో తరగతి వరకూ పట్టాభిపురం మున్సిఫల్ పాఠశాలలో చదువుకుంది. ఆ తర్వాత ఇంటర్ ఆర్కా కాలేజ్ లో పూర్తి చేసింది. పదో తరగతిలో పదికి పది మార్కులు తెచ్చకున్న శ్రుతి ఇంటర్ లో 966 మార్కులు సాధించింది. గత నీట్ ఎగ్జామ్ లో 619 మార్కులు సాధించింది. అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో ఫీజు కట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల పంతొమ్మిదో తేది నాటికి డబ్బులు కట్టలేకపోతే ఇక సీటు గురించి మర్చిపోవడమే..!
అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పందించారు. ఆ విద్యార్ధిని వైద్య విద్యకు అవసరమయ్యే మొత్తానికి చెల్లించేందుకు ముందుకు వచ్చారు. వెంటనే ఆమె ఇంటికి వెళ్లి 1,76,500 రూపాయల చెక్ అందించారు. ఎమ్మెల్యే భర్త రామచంద్రరావు నిర్వహించే శ్రీ భ్రమరా ట్రస్ట్ తరుఫున ఆమె చదువుకు అవసరమయ్యే మొత్తాన్ని చెల్లిస్తామని ఆమె తెలిపారు. ఈ ఏడాదే కాదు చదువు పూర్తి అయ్యే వరకూ కాలేజ్ పీజులన్నీ చెల్లిస్తామని ఎమ్మెల్యే దంపతులు హామీ ఇచ్చారు.
కష్టపడి చదువుకున్నా ఆర్థిక స్తోమత లేని కారణంగా తన ఆశ నెరవేరే అవకాశం లేదని బోరున విలపించిన శ్రుతికి తామున్నామని చెప్పి ఫీజు చెల్లించిన ఎమ్మెల్యే దంపతులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..