Watch: తిరుమల లడ్డూ నాణ్యతపై వివాదం.. చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన అభ్యంతరం

Watch: తిరుమల లడ్డూ నాణ్యతపై వివాదం.. చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన అభ్యంతరం

Janardhan Veluru

|

Updated on: Sep 19, 2024 | 3:21 PM

తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారంరేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె వినియోగించారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే.

తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారంరేపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె వినియోగించారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. దీనిపై తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని.. చంద్రబాబు కూడా ప్రమాణం చేసేందుకు ముందుకు రావాలని వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ విసిరారు. మొత్తానికి ఈ వివాదం శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హిందూ వ్యతిరేకులు మాట్లాడాల్సిన మాటలు చంద్రబాబు మాట్లాడారన్నారంటూ మండిపడ్డారు. శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రమైనదిగా భావించే లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. హిందువుల మనోభావాలను చంద్రబాబు కించపరిచారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే హిందూయేతరుడైన కరీముల్లా షరీఫ్‌ను విజిలెన్స్‌ అధికారిగా నియమించారని ఆరోపించారు. కరీముల్లాతో చంద్రబాబు ఆయనకు కావాల్సిన రిపోర్ట్ రాయించుకున్నారని ఆరోపించారు. జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేసినవారంతా సర్వం నాశనం అవుతారన్నారు. లేదంటే ఆరోపణలు చేసిన వ్యక్తే సర్వనాశనం అవుతారన్నారు.

Published on: Sep 19, 2024 03:20 PM