AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tenali: పైనున్న నాన్న ఆత్మ శాంతించాలని.. కొడుకు ఏం చేశాడో తెలుసా..?

గ్రామంలో ఆధిపత్య పోరు.. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలకు దారి తీశాయి. చేపల చెరువుల ఏర్పాటు, గుడి మేనేజ్‌మెంట్ డబ్బుల వసూలు విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఆ ఘర్షణలు తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు కూడా కొనసాగించాడు. ఈ క్రమంలో సమయం కోసం వేచి చూశాడు...

Tenali: పైనున్న నాన్న ఆత్మ శాంతించాలని.. కొడుకు ఏం చేశాడో తెలుసా..?
Killer Arrested
T Nagaraju
| Edited By: |

Updated on: Oct 17, 2025 | 6:25 PM

Share

గ్రామంలో ఆధిపత్య పోరు కుటుంబ సభ్యుల మధ్యే విబేధాలకు కారణమయ్యాయి. చేపల చెరువుల ఏర్పాటు, గుడి నిర్మాణంలో డబ్బులు వసూల్లు ఇద్దరి వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరుకు దారి తీశాయి. ఒక వ్యక్తి చేతిలో పదే పదే ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక ఆ విషయాన్నే కొడుకు చెప్పాడు. తన తండ్రి ఓటమికి బదులు తీర్చుకోవాలనుకున్నాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత ప్రత్యర్ధిని హత్య చేసి పోలీసులకు చిక్కాడు…

గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం కోరు తాడిపర్రులో జుటూరి తిరుపతిరావు, గండికోట క్రిష్ణమూర్తి మధ్య ఐదేళ్ల క్రితం ఆధిపత్య పోరు మొదలైంది. ఇద్దరి కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలున్నాయి. అయినప్పటికీ ఒక కుటుంబంపై మరొక కుటుంబానికి కక్షలు మొదలయ్యాయి. రాములవారి గుడి మేనేజ్‌మెంట్ విషయంలోనూ తిరుపతిరావు, క్రిష్ణమూర్తి ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డారు. అయితే తిరుపతిరావే మేనేజ్‌మెంట్ దక్కించుకున్నాడు. చందాలు వసూలు చేయడం దగ్గర నుంచి.. వాటిని ఖర్చు చేసే వరకూ తిరుపతిరావు మాటే చెల్లుబాలు అవుతూ వచ్చింది. ఇక గ్రామానికి చెందిన చేపల చెరువుల విషయంలోనూ తిరుపతిరావే పై చేయి సాధించాడు. దీంతో క్రిష్ణమూర్తి ఈ విషయాలన్నీ కొడుకు సుబ్బారావుకి చెప్పి బాధపడేవాడు. తన బంధువైన తిరుపతిరావు పెత్తనం చేయడం తాము ఎన్ని సార్లు పై చేయి సాధించాలని అనుకున్నా కుదరకపోవడంతో ఆ కుటుంబంపై క్రిష్ణమూర్తి, సుబ్బారావులకు కక్ష పెరిగింది. అయితే కొద్దీ కాలం క్రితం క్రిష్ణమూర్తి చనిపోయాడు. ఇకగ్రామంలో గొడవలు జరుగుతుండటంతో అక్కడ ఉండలేక సుబ్బారావు తెనాలి చేరుకున్నాడు.

తెనాలిలో ఉండగానే భార్యతో గొడవలు జరిగాయి. ఆమె సుబ్బారావును వదిలిపెట్టి వెళ్లిపోయింది. మరొక మహిళను చేరదీసిన సుబ్బారావు ఆమెతో కలిసి జీవిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం టైఫాయిడ్ జ్వరం బారిన పడిన తిరుపతిరావు గ్రామం నుండి తెనాలిలోని అల్లుడింటికి వైద్యం చేయించుకునేందుకు వచ్చాడు. అదే కాలనీలో సుబ్బారావు కూడా నివసిస్తున్నాడు. తిరుపతిరావు ఒంటరిగా తిరుగుతుండటాన్ని సుబ్బారావు గమనించాడు. తనలో తిరుపతిరావుపై పేరుకుపోయిన కసిని బయటకు తీశాడు. ఎలాగైనా తిరుపతిరావును చంపాలనుకున్నాడు. కొబ్బరి బోండాలు నరికే కత్తిని సేకరించుకొని బైక్‌లో పెట్టుకున్నాడు. ఈ నెల పద్నాలుగో తేదిన ఒంటరిగా తిరుపతిరావు రావటాన్ని గమనించి టిఫిన్ తీసుకుంటున్న తిరుపతిరావుపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు. సిసి కెమెరాల సాయంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ఎదుట హజరుపరిచారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా