ఫేస్ బుక్ పరిచయాలు అమ్మాయిల్ని నిండా ముంచుతున్నాయి. లేటెస్ట్‌గా కృష్ణాజిల్లాలో అదే రిపీట్ అయింది. కర్రా న్యూటన్ బాబుకి ఫేస్‌బుక్‌లో గుడివాడ టౌన్‌కు చెందిన ఓ యువతి పరిచయం అయింది. మొదట్లో ఆ ఫ్రెండ్ కదా అని సరదాగా మాట్లాడింది. ఆ తర్వాత న్యూడ్ కాల్స్ చేసేలా న్యూటన్ బాబు ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆమె అతడితో నగ్న వీడియో కాల్స్ మాట్లాడింది. అదే ఆమెపాలిట శాపంగా మారింది. ఇటీవల సదరు యువతికి ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. కాబోయే భర్తే కదా అని అతడితో కూడా యువతి శారీరకంగా దగ్గరైంది. జూన్ 14 న వారి మ్యారేజ్ జరిగాల్సి ఉంది. ఇక్కడ అసలు ట్విస్ట్.
యువతి న్యూడ్ కాల్స్ రికార్డ్ చేసిన కర్రా న్యూటన్‌బాబు.. వాటిని ఆమెను చేసుకోబోయే పెళ్లికొడుక్కి పంపించాడు. అంతేకాదు తన ఫ్రెండ్స్‌కి, బంధువులకు కూడా వీడియోస్ షేర్ చేశాడు. దీంతో పెళ్లి కొడుకు పెళ్లికి నిరాకరించాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధిత యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. నిందితులు అందరిపై గుడివాడ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్నాలజీ సాయంతో ఆధారారాలు సేకరించారు. న్యూటన్‌బాబుపై అత్యాచార యత్నం కేసు, వీడియోలు షేర్ చేసిన వారిపై 109, 120(బి) ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
అమ్మాయిల ఇలా సోషల్ మీడియా పరిచయం అయ్యేవారి నమ్మి.. విలువైన భవిష్యత్ నాశం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా యువతులు, వివాహితలను ట్రాప్ చేసేవారిని ఎట్ట పరిస్థితుల్లో ఉపేక్షించమని వార్నింగ్ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.