GST: టెక్స్ టైల్స్ రంగంపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా.. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరముందన్న మంత్రి బుగ్గన..

|

Dec 31, 2021 | 3:49 PM

వస్త్ర వ్యాపారులపై ఊరట లభించింది. జనవరి నుంచి పెంచిన పన్ను అమలు చేయాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం వాయిదా పడింది. టెక్స్ టైల్స్ రంగంపై జీఎస్టీ 5 శాతం నుండి 12శాతం పెంపు..

GST: టెక్స్ టైల్స్ రంగంపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా.. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరముందన్న మంత్రి బుగ్గన..
Nirmala Sitharaman
Follow us on

GST Council: వస్త్ర వ్యాపారులపై ఊరట లభించింది. జనవరి నుంచి పెంచిన పన్ను అమలు చేయాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం వాయిదా పడింది. టెక్స్ టైల్స్ రంగంపై జీఎస్టీ 5 శాతం నుండి 12శాతం పెంపు నిర్ణయం వాయిదా వేసుకున్నారు.  ఇవాళ ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం చేశారు. మరికాసేపట్లో వివరాలు వెల్లడించనున్న ఆర్థిక మంత్రి నిర్మాలా సీతరామన్. 5శాతం నుండి 12 శాతం పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణా సహా పలు రాష్ట్రాలు. కౌన్సిల్ తాజా నిర్ణయంతో రేపటి నుండి అమలులోకి రావాల్సిన పెంపు నిర్ణయం వాయిదా పడింది.

ఇదిలావుంటే తాము కూడా కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లుగా తెలిపారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. తమ రాష్ట్రంలో అధికంగా చేనేత కార్మికులు ఉన్నారని.. వారిపై జీఎస్టీ నిర్ణయ ప్రభావం ఉంటుందని అన్నారు. అందుకే చేనేత వస్త్రాల మీద 12 శాతం జీఎస్టీ వేయాలన్న ప్రతిపాదనను ఏపీ సహా  చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయని అన్నారు. అందుకే పెంపు ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ పక్కన పెట్టిందన్నారు. పాలిమర్, కాటన్ వస్త్రాల ఉత్పత్తి శాతంపై ఎలాంటి డేటా లేదని పేర్కొన్నారు.

మన రాష్ట్రంలో కాటన్ వస్త్రాల వాడకం ఉందని.. చేనేత కార్మికులను ఆదుకోవాలని సీఎం జగన్ కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. చేనేత కార్మికులకు, వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకూడదని.. చేనేత మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని తెలిపారు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని.. చేనేత వస్త్రాల మీద ప్రస్తుతం ఉన్న 5% జీఎస్టీ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ విషయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయించామన్నారు.

జనవరి 12న జరిగే హోంశాఖ కార్యదర్శి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. దక్షిణ రాష్ట్రాల మండలి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్రం హోంశాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో మాట్లాడుతామని తెలిపారు. వచ్చే బడ్జెట్ లో దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరినట్లు తెలిపారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు రాయితీలు, వెనుకబడిన ప్రాంతాలకు కేబీకే ప్యాకేజీ ఇవ్వాలని.. నడికుడి- శ్రీకాళహస్తి, కడప – బెంగుళూర్ రైల్వే, కోటిపల్లి, రాయదుర్గం లైన్లతో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు.

ఇవి కూడా చదవండి: Tadikonda MLA Sridevi: మాదిగలకు హక్కులు ఆయన వల్లే రాలేదు.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి

Green Coriander Benefits: పచ్చి కొత్తిమీరను తినేవారు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.. ఏంటంటే..