గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే టార్గెట్, డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తున్న విజయసాయి

GVMC ఎన్నికల నేపథ్యంలో డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తున్నారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. బస్తీల్లోకి వెళ్లి జనంతో మాట్లాడుతున్నారు...

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే టార్గెట్, డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తున్న విజయసాయి

Updated on: Feb 18, 2021 | 1:57 PM

GVMC ఎన్నికల నేపథ్యంలో డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తున్నారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. బస్తీల్లోకి వెళ్లి జనంతో మాట్లాడుతున్నారు. వాళ్ల సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 14వ డివిజన్‌ బిలాల్‌ నగర్‌లో పర్యటించారాయన. అక్కడున్న పేదలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని, పట్టాలు ఇప్పిస్తామని హామీనిచ్చారు. మంచినీళ్లు, రోడ్ల సమస్యలను తమ ట్రస్ట్‌ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు విజయసాయిరెడ్డి.

Read also : ప్రాణాపాయం ఉందని 6 నెలల నుంచీ ప్రాధేయపడుతున్నారు.. చీఫ్‌ జస్టిస్‌కే మొరపెట్టుకున్నారు. చివరికి ఊహించిందే అయింది