AP Budget Session 2023: పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ పాలన.. నవరత్నాలపై కొత్త గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రశంసలు..

|

Mar 14, 2023 | 11:03 AM

గవర్నర్ ప్రసంగానికి ఉభయసభల సంయుక్త సమావేశం వేదికైంది. ఈ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక ప్రసంగం చేశారు. తొలిసారి అసెంబ్లీలో  ప్రసంగిస్తూ.. పేదలకు సంక్షేమ పథకాలు అమలు..

AP Budget Session 2023: పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ పాలన.. నవరత్నాలపై కొత్త గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రశంసలు..
Governor Abdul Nazeer
Follow us on

తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు ఉభయసభల సమావేశం ప్రారంభమైంది. సంప్రదాయంగా వస్తున్న గవర్నర్ ప్రసంగానికి ఉభయసభల సంయుక్త సమావేశం వేదికైంది. ఈ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక ప్రసంగం చేశారు. తొలిసారి అసెంబ్లీలో  ప్రసంగిస్తూ.. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్‌ వ్యవస్థ అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. వినూత్నంగా వాలంటీర్‌ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్‌ తెలిపారు.

నవరత్నాలతో రాష్ట్రానికి సంక్షేమ పాలన అందుతోందన్నారు. నాలుగేళ్లుగా ఐదుకోట్ల మందికి సంక్షేమ పాలన అందుతోందన్నారు. ప్రత్యక్షనగదు బదిలీ ద్వారా అవినీతి లేని పాలన అందుతోందన్నారు. రాష్ట్రంలో 11.43 శాతం జీడీపీ వృద్ధి నమోదైందన్నారు. 2020-21 జీడీపీ వృద్ధిలో ఏపీ దేశంలోనే నంబర్ 1గా ఉందన్నారు.

అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు. కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నాం. 11.43 శాతం గ్రోత్‌ రేటును సాధించాం. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉంది. మనబడి నాడు-నేడు పథకాలతో విద్యారంగంలో సంస్కరణలు.

ఏపీ అసెంబ్లీ లైవ్ కోసం ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం