ఎమ్మెల్యే బాలకృష్ణకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. పీఏ బాలాజీ డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు
సినీ నటుడు, హిందూపురం(HIndupuram) ఎమ్మెల్యే బాలకృష్ణకు(MLA Balakrishna) ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన పీఏగా పనిచేస్తున్న బాలాజీ డిప్యూటేషన్ ను రద్దు చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కర్ణాటక(Karnataka) సరిహద్దులోని బార్...
సినీ నటుడు, హిందూపురం(HIndupuram) ఎమ్మెల్యే బాలకృష్ణకు(MLA Balakrishna) ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన పీఏగా పనిచేస్తున్న బాలాజీ డిప్యూటేషన్ ను రద్దు చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కర్ణాటక(Karnataka) సరిహద్దులోని బార్ అండ్ రెస్టారెంట్ లో పేకాట ఆడుతూ బాలాజీ పట్టుబడ్డారు. వైసీపీ స్థానిక నేతలతో కలిసి ఆయన పేకాట ఆడారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలాజీని అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఆయనపై విచారణ జరిపిన ప్రభుత్వం పీఏగా డిప్యూటేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బాలాజీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. ఆయనను పీఏగా నియమించుకునేందుకు బాలకృష్ణ అనుమతి కోరగా ప్రభుత్వం అంగీకరించింది. చాలా రోజుల నుంచి బాలకృష్ణ పీఏగా నియోజకవర్గంలో వ్యవహారాలు చక్కదిద్దుతున్నారు. బాలకృష్ణ స్థానికంగా ఇల్లు తీసుకున్నప్పటికీ ఎక్కువగా ఉండరు. ఎమ్మెల్యే తరపున వ్యవహారాలన్నీ బాలాజీనే చక్కబెడుతూ ఉంటారు. దీంతో ఆయన ఎమ్మె.ల్యే ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉంటారు.
ఇలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా వైసీపీ నేతలతో కలిసి పొరుగు రాష్ట్రంలో పేకాడుతూ దొరికిపోవడం సంచలనంగా మారింది. అయితే పేకాట ఆడుతూ బాలాజీ దొరికిపోయినప్పటికీ బాలకృష్ణ స్పందించలేదు. ఈ క్రమంలో పీఏగా ఆయనను అక్కడ కొనసాగించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుపుతూ డిప్యూటేషన్ రద్దు చేసింది. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి టీచర్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ పీఏల వ్యవహారశైలి వివాదాస్పదమైంది.
Also Read
Senior Citizens: సీనియర్ సిటిజన్లకి బంపర్ ఆఫర్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అదిరిపోయే రిటర్న్స్..!
Jackfruit Benefits: వేసవిలో పనసపండు తినడం వల్ల వ్యాధులు దూరం.. ఎన్నో అద్భుత ప్రయోజనాలు..