West Godavari: కుదేలవుతున్న ఆక్వా రంగం.. చందువా చేప ధర భారీగా పతనం.. ఆందోళనలో రైతులు.. ప్రభుత్వం ఆదుకోవాలని వినతి

| Edited By: Surya Kala

Oct 08, 2023 | 8:47 AM

రూప్ చంద్ చేపల ధరలు భారీగా పతనమయ్యాయి. రెండు మూడు నెలల ముందు వరకు కిలో రూ. 100 కి పైగా ఉన్న రూప్ చంద్ ధర ప్రస్తుతం రూ.70 కన్నా తక్కువగా పడిపోయింది. దాంతో రైతులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో నలిగిపోతున్నారు. కిలో రూప్ చంద్ తయారీకి అన్ని ఖర్చులు కలిపి రూ.95 వరకు ఖర్చవుతుంది. అంటే ప్రస్తుత ధరతో పోల్చుకుంటే ఒక కిలోకు రూ.25 నష్టం నష్టం వస్తుంది.

West Godavari: కుదేలవుతున్న ఆక్వా రంగం.. చందువా చేప ధర భారీగా పతనం.. ఆందోళనలో రైతులు.. ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
Fish Tanks
Follow us on

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా రంగం కుదేలవుతుంది. రూప్ చంద్ చేపలు సాగు చేసే రైతులు నష్టాల బాట పట్టారు. ధరలు భారీగా ధరలు తగ్గడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా కిలోకి రూ.70 కన్నా తక్కువగా ధర ఉండడంతో తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రొయ్యల సాగు తర్వాత వేలాది ఎకరాల్లో రూప్ చంద్ను సాగు చేస్తారు. కొన్ని నెలల క్రితం రూప్ చంద్ ధర కిలోకి రూ.100 కు పైగా ఉండేది కానీ ప్రస్తుతం ధర భారీగా పతన మవడంతో పరిస్థితి ఎప్పుడు చక్కబడుతుందో తెలియక రైతులు కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఇటీవల రెండు నెలలుగా శ్రావణమాసం, వినాయక చవితి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు భారీగా రూప్ చంద్ ఎగుమతులు తగ్గిపోయాయి.

పశ్చిమ బెంగాల్ బీహార్ రాష్ట్రాల్లో రూప్ చంద్ చేపలను ఎక్కువగా తింటారు. ఎకరం చెరువులో సుమారు 4 వేల నుంచి 5 వల వరకు రూప్ చంద్ చేప పిల్లలను పెంచుతారు. ఎకరానికి నాలుగు టన్నులపైనే దిగుబడి వస్తుంది. ఒక కిలో రూప్ చంద్ చేప అన్ని ఖర్చులు కలుపుకొని సుమారు రూ.95 రూపాయల ఖర్చవుతుందనీ రైతులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ధర రూ.70 కన్నా తక్కువగా అవడంతో ఎకరానికి సుమారు రెండున్నర లక్షల వరకు నష్టం వస్తుందని, 5 ఎకరాల చెరువు కైతే సుమారు 12 లక్షల రూపాయలు నష్టం కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు. సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 15 రైతులు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు

రూప్ చంద్ ప్రత్యేకత

ప్రత్యేకమైన రుచికర చేపలలో రూప్ చంద్ ఒకటి.. ఈ రూప్ చంద్ చేపలు భారతదేశంలో, చైనాలోనూ పెరుగుతుంది. ఇది భిన్నమైన నిర్మాణ శైలి కలిగి ఉన్న చేప. ఈ చేపను చైనీస్ లో ఫ్రాంఫెట్ అని పిలుస్తారు. ఈ విధంగా తెలుగులో దీన్ని చందువా లేదా సందువా అని పిలుస్తారు. ఈ జాతి చేపలు కొన్ని ఎరుపు, తెలుపు నలుపు సిల్వర్ రంగులలో ఉంటాయి. ఇది చెరువులోనూ నదులలోను పెరుగుతాయి. సిల్వర్ రంగులో చేపలు ఉప్పునీటిలో సైతం పెరుగుతాయి. ఎముకను కలిగి ఉండటం ఈ చేప యొక్క ముఖ్యమైన ప్రత్యేకత. దాంతో ముళ్ళు గుచ్చుకుంటాయనే భయం ఉండకుండా ఈ చేపలను ఎక్కువగా ఇష్టంగా తింటారు. రూప్ చంద్ మాంసంలో ఎక్కువగా ప్రోటీన్లు విటమిన్లు లభిస్తాయి. అవి మానవ శరీరానికి ఎంతో ముఖ్యమైనవి. పోషక విలువలు అధికంగా ఉండే ఈ గ్రూప్ చంద్ చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. దీనిలో ప్రత్యేకంగా అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు, విటమిన్లు.యు మినరల్ పుష్కలంగా ఉంటాయి. రూప్ చంద్ చేపలో సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఇ, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దాంతో మనిషి మెదడు పనితీరు బాగా పనిచేస్తుంది, గుండె జబ్బులకు గురికాకుండా ఉంటారు. అలాగే ఇందులో ఉండే ఐరన్ మెగ్నీషియం మానవ శరీరంలో ఎంజైముల పనితీరు మెరుగుపరుస్తుంది. దాంతో ఈ చేపలకు ప్రత్యేక డిమాండ్ వున్నా ఎగుమతులు నిలిచి ధరలు పతనం అవడంతో రైతులు నష్టాల బాట పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

రూప్ చంద్ ధరలు

రూప్ చంద్ చేపల ధరలు భారీగా పతనమయ్యాయి. రెండు మూడు నెలల ముందు వరకు కిలో రూ. 100 కి పైగా ఉన్న రూప్ చంద్ ధర ప్రస్తుతం రూ.70 కన్నా తక్కువగా పడిపోయింది. దాంతో రైతులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో నలిగిపోతున్నారు. కిలో రూప్ చంద్ తయారీకి అన్ని ఖర్చులు కలిపి రూ.95 వరకు ఖర్చవుతుంది. అంటే ప్రస్తుత ధరతో పోల్చుకుంటే ఒక కిలోకు రూ.25 నష్టం నష్టం వస్తుంది. దాంతో ఇటీవల రైతులు తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. వేలాది ఎకరాల్లో రూప్ చంద్ సాగు చేస్తున్నామని, ఇలాగే ధరలు కొనసాగితే నష్టాల ఊబిలో కూరుకుపోయి అప్పుల పాలయ్యే అవకాశం ఉందని, కనీసం కిలో ధర రూ.80 కొనుగోలు చేయాలని రైతులు వ్యాపారులను కోరుతున్నారు అప్పుడు కాస్తయినా తమకు ఉపశమనం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇటీవల జరిగిన ట్రేడర్స్ సమావేశంలో కిలో ధర రూ.80 కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. అయితే దీనిపై స్పందించిన మత్స్యశాఖ అధికారులు రూప్ చంద్ ధర తగ్గటం వాస్తవమేనని, ట్రేడర్స్ తో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని, రైతులకు నష్టాలు కలగకుండా మేత ధరలు తగ్గించడం వంటి చర్యలు చేపట్టామని అధికారులు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..