Global Investors Summit
Global Investors Summit in Visakhapatnam: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్త్‌లో పెట్టుబడులపై కీలక ప్రసంగాలు చేశారు. రాబోయే రోజుల్లో భారీ పెట్టనున్నట్టు తెలిపారు. దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో పాటు, కేంద్రమంత్రులు, 46 మంది దౌత్యవేత్తలు, 30 మంది గ్లోబల్ బిజినెస్ లీడర్లు, 25 దేశాలకు చెందిన 14 వేల మంది ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు 345 ప్రతిపాదనలు వచ్చాయన్నారు సీఎం . వాటి విలువ 13 లక్షల కోట్లు అని ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడుల కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తామన్న సీఎం.. 21 రోజుల్లో అనుమతుల మంజూరు చేస్తామన్నారు.
మూడు రాజధానులపై మరోసారి స్పష్టత ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రముఖ వ్యాపారవేత్తలు, వేలాది మంది అతిధుల మధ్య ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నగరంగా విశాఖ ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేశారు. గతంలో ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలే మరోసారి సాగరతీరం సాక్షిగా చెప్పారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా 11లక్షల 87 వేల 756 కోట్ల విలువైన 92 ఒప్పందాలు చేసుకుంది ఏపీ సర్కార్. NTPCతో 2 లక్షల 35 వేల కోట్లు, ABC లిమిటెడ్‌తో లక్షా 20 వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంది. రెన్యూ పవర్‌తో 97 వేల 550 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.
ఎన్టీపీసా ఎంవోయూ(రూ. 2..35లక్షల కోట్లు)
- ఏబీసీ లిమిటెట్ ఎంవోయూ(రూ. 1.20 లక్షల కోట్లు)
- రెన్యూ పవర్ ఎంవోయూ(రూ. 97, 550 కోట్లు)
- ఇండోసాల్ ఎంవోయూ(రూ. 76, 033 కోట్లు)
- ఏసీఎమ్‌ఈ ఎంవోయూ(రూ. 68,976 కోట్లు)
- టీఈపీఎస్‌ఓఎల్ ఎంవోయూ( రూ. 65, 000 కోట్లు)
- జేఎస్‌డబ్యూ గ్రూప్(రూ. 50, 632 కోట్లు)
- హంచ్ వెంచర్స్(రూ. 50 వేల కోట్లు)
- అవాదా గ్రూప్( రూ 50 వేల కోట్లు)
- గ్రీన్ కో ఎంవోయూ(47, 600 కోట్లు)
- ఓసీఐఓఆర్ ఎంవోయూ (రూ. 40వేల కోట్లు)
- హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ (రూ. 30వేల కోట్లు)
- వైజాగ్ టెక్ పార్క్ (రూ. 21,844 కోట్లు)
- అదానీ ఎనర్జీ గ్రూప్ (రూ.21, 820 కోట్లు)
- ఎకోరెన్ ఎనర్జీ (రూ.15,500 కోట్లు)
- సెరంటికా ఎంవోయూ (రూ. 12,500 కోట్లు)
- ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ (రూ.12వేల కోట్లు)
- అరబిందో గ్రూప్ (రూ.10, 365 కోట్లు)
- ఓ2 పవర్ ఎంవోయూ ( రూ.10వేల కోట్లు)
- ఏజీపీ సిటీ గ్యాస్ (రూ. 10వేల కోట్లు)
- జేసన్ ఇన్‌ఫ్రా ఎంవోయూ (రూ. 10వేల కోట్లు)
- ఆదిత్య బిర్లా గ్రూప్ (రూ. 9,300 కోట్లు)
- జిందాల్ స్టీల్ (రూ. 7500 కోట్లు)
- టీసీఎల్ ఎంవోయూ(రూ. 5,500 కోట్లు)
- ఏఎం గ్రీన్ ఎనర్జీ(రూ. 5,000 కోట్లు)
- ఉత్కర్ష అల్యూమినియం(రూ. 4,500 కోట్లు)
- ఐపోసీఎల్ ఎంవోయూ(రూ. 4,300 కోట్లు)
- వర్షిణి పవర్ ఎంవోయూ(రూ, 4,200 కోట్లు)
- ఆశ్రయం ఇన్‌ఫ్రా(రూ. 3,500 కోట్లు)
- మైహోమ్ ఎంవోయూ(3,100 కోట్లు)
- వెనికా జల విద్యుత్ ఎంవోయూ(రూ. 3000 కోట్లు)
- డైకిన్ ఎంవోయూ(రూ. 2,600 కోట్లు)
- సన్నీ ఒపోటెక్ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు)
- భూమి వరల్డ్ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు)
- అల్ట్రాటెక్ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు)
- ఆంధ్రా పేపర్ ఎంవోయూ(ర. 2వేల కోట్లు)
- మోండాలెజ్ ఎంవోయూ(రూ. 1,600 కోట్లు)
- అంప్లస్ ఎనర్జీ(రూ. 1,500 కోట్లు)
- గ్రిడ్ ఎడ్జ్ వర్క్స్ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)
- టీవీఎస్ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)
- హైజెన్‌కో ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)
- వెల్స్‌పన్ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)
- ఒబెరాయ్ గ్రూప్(రూ. 1,350 కోట్లు)
- దేవభూమి రోప్‌వేస్(రూ. 1,250 కోట్లు)
- సాగర్ పవర్ ఎంవోయూ(రూ. 1,250 కోట్లు)
- లారస్ గ్రూప్(రూ. 1,210 కోట్లు)
- ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్స్(రూ. 1,113 కోట్లు)
- డెక్కన్ ఫైన్ కెమికల్స్(రూ. 1,110 కోట్లు)
- దివీస్ ఎంవోయూ(రూ. 1,100 కోట్లు)
- డ్రీమ్ వ్యాలీ గ్రూప్(రూ. 1,080 కోట్లు)
- భ్రమరాంబ గ్రూప్(రూ. 1,038 కోట్లు)
- మంజీరాహోటల్స్ అండ్ రిసార్ట్స్(రూ. 1,000 కోట్లు)
- ఏస్ అర్బన్ డెవలపర్స్(రూ. 1,000 కోట్లు)
- శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్(రూ. 1,000 కోట్లు)
- ఎంఆర్‌కేఆర్ కన్‌స్టక్షన్స్(రూ. 1,000 కోట్లు)
- సెల్‌కాన్ ఎంవోయూ(రూ.1,000 కోట్లు)
- తుని హోటల్స్ ఎంవోయూ(రూ. 1,000 కోట్లు)
- విష్ణు కెమికల్స్(రూ. 1,000 కోట్లు)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం